రోజూ ఉదయాన్నే నిమ్మరసం, చియా సీడ్స్ నీరు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Updated on: Aug 12, 2026 | 8:36 PM

ఆరోగ్యకరమైన జీవనశైలికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరిగి, శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే సాధారణంగా తాగే నీటికి బదులుగా అందులో నిమ్మరసం, నానబెట్టిన చియా గింజలను కలిపి తీసుకుంటే రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
అద్భుతమైన హైడ్రేషన్, ఎనర్జీ బూస్టర్: చియా సీడ్స్, నిమ్మరసం కలిపిన నీరు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా ఉదయాన్నే ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి తక్షణ ఉత్సాహం లభిస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని రీఫ్రెష్‌గా ఉంచే నాచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది.

2 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: చియా విత్తనాలను నీటిలో నానబెట్టినప్పుడు అవి జెల్ లాగా మారతాయి. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం, ప్రీబయోటిక్ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో నిమ్మకాయ-చియా కాంబినేషన్ అద్భుతంగా తోడ్పడుతుంది.

3 / 5
గుండె ఆరోగ్యానికి మేలు: చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

4 / 5
షుగర్ లెవల్స్ నియంత్రణ: చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తాయి. డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ ఈ పానీయం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.

5 / 5
మెరిసే చర్మం - యవ్వన కాంతి: నిమ్మకాయలోని విటమిన్ C, చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, సహజమైన నిగారింపు లభిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకునే వారు, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారు ఈ పానీయాన్ని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Loading...
Unable to load recommendations.
Follow Us