నెయ్యి తింటే నిజంగా బరువు పెరుగుతారా..? అపోహలు కాదు డైటీషియన్లు చెబుతున్న అసలు వాస్తవాలు ఇవే..

Updated on: May 14, 2026 | 6:59 AM

తరతరాలుగా భారతీయ జీవనశైలిలో భాగమైన నెయ్యి నేడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బలానికి చిరునామాగా భావించిన నెయ్యిని, నేటి జనరేషన్ బరువు పెరుగుతామనే భయంతో డైనింగ్ టేబుల్ నుండి దూరం పెడుతోంది. అయితే నిజంగానే నెయ్యి ఆరోగ్యానికి శత్రువా? లేక మన వంటగదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఔషధమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
అపోహ వర్సెస్ వాస్తవం: చాలా మంది నెయ్యిని కేవలం కొవ్వు పదార్థంగానే చూస్తారు. నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, అది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నెయ్యి తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారని ప్రజలు తరచుగా నమ్ముతారు. కానీ బరువు పెరగడానికి కారణం నెయ్యి ఒక్కటే కాదు, మనం తీసుకునే మొత్తం కేలరీలు, మన శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు.

2 / 5
పోషకాల గని:  దేశీ నెయ్యిలో ఉండే పోషక విలువలు దానిని ఇతర నూనెల కంటే మెరుగ్గా నిలుపుతాయి. ఇందులో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుదల నుండి ఎముకల బలం వరకు తోడ్పడతాయి. నెయ్యి ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థలోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

3 / 5
బరువుకు, నెయ్యికి ఉన్న సంబంధం ఏంటి? కైలాష్ దీపక్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ డైటీషియన్ అయిన డాక్టర్ రిచా శర్మ నెయ్యి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి బరువు పెరుగుతాడా లేదా అనేది అతను తీసుకునే నెయ్యి పరిమాణం, అతని జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు, శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. నెయ్యిని మితంగా తీసుకుంటే అది జీవక్రియను వేగవంతం చేసి, శక్తిని ఇస్తుంది.

4 / 5
వంటల్లో నెయ్యి ప్రాముఖ్యత: పల్లెటూళ్లలో వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకోవడం ఒక సంప్రదాయం. పట్టణాల్లోనూ షీరా, హల్వా వంటి స్వీట్ల తయారీలో దీనికి ప్రత్యామ్నాయం లేదు. నెయ్యికి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల, అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినా ఇందులోని పోషకాలు దెబ్బతినవు. ఇది రిఫైన్డ్ నూనెల కంటే నెయ్యిని సురక్షితమైన ఎంపికగా మారుస్తుంది.

5 / 5
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?: నెయ్యి ఆరోగ్యకరమే, కానీ దానిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం.  రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి ఆరోగ్యవంతులకు సరిపోతుంది. నెయ్యి తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నడక లేదా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. నిశ్చల జీవనశైలి ఉన్నవారు కేలరీల విషయంలో జాగ్రత్త వహించాలి. నెయ్యిని ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి.

Follow Us