Mobile Phone Charging: మీరూ మొబైల్‌ ఫోన్‌ను 100 శాతం ఛార్జ్‌ చేస్తున్నారా..?

Edited By: Janardhan Veluru

Updated on: Oct 13, 2025 | 1:48 PM

Why mobile phones should never be charged to 100 percent? చాలా మంది తమ ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేస్తుంటారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ ఈ అలవాటు ఫోన్ బ్యాటరీకి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మొబైల్ ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీకి మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని నిపుణులు..

1 / 5
చాలా మంది తమ ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేస్తుంటారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ ఈ అలవాటు ఫోన్ బ్యాటరీకి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మొబైల్ ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీకి మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా బ్యాటరీ లైఫ్ కూడా వేగంగా తగ్గుతుంది. అందువల్ల మొబైల్ ఫోన్‌కు ఎంత శాతం ఛార్జ్ చేయాలో? 100 శాతం ఛార్జ్ ఎందుకు ఇవ్వకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
చాలా ఫోన్‌లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలకు గరిష్ట ఛార్జ్‌ చేస్తే అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీ 100% ఛార్జ్ అయినప్పుడు వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి క్రమంగా బ్యాటరీ సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది.

3 / 5
ప్రతి బ్యాటరీకి పరిమిత సంఖ్యలో ఛార్జ్-డిశ్చార్జ్ సైకిల్స్ ఉంటాయి. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఆ సైకిల్స్ త్వరగా ముగుస్తాయి. అంటే బ్యాటరీ త్వరగా పాతబడిపోతుంది. పాత బ్యాటరీలకు 'మెమరీ ఎఫెక్ట్' సమస్య ఉంటుంది. కొత్త బ్యాటరీలకు అది ఉండదు. అయితే వాటిని పదే పదే 100% ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీలోని రసాయన సమతుల్యతపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఫోన్‌ స్పీడ్‌ నెమ్మదిస్తుంది.

4 / 5
ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉంచడానికి 20% నుంచి 80% మధ్య ఛార్జ్ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది బ్యాటరీ మన్నికగా ఉంచడానికి సహాయపడుతుంది. అందే మీరు 100% వరకు వేగంగా ఛార్జ్ చేసినా, బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. అందుకే నిపుణులు మొబైల్ ఫోన్‌ను 80% ఛార్జ్‌లో ఆపమని సిఫార్సు చేస్తున్నారు.

5 / 5
చాలా మంది రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసి పడుకుంటారు. దీనివల్ల ఫోన్ ఎక్కువసేపు 100% ఛార్జ్‌లో ఉంటుంది. ఇది బ్యాటరీపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.