
ఊటీ : డిసెంబర్ నెలలో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఊటీ చాలా బెస్ట్ అని చెప్పాలి. అందమైన కాఫీ తోటలు, పచ్చని చెట్లు , ఎత్తైన కొండల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. ఊటీని కొండల రాణి అని కూడా పిలుస్తారు. డిసెంబర్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. పూల తోటలు, సరస్సులు, కొండల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చు.

మనాలి : అందమైన ప్రదేశాల్లో మనాలి ఒకటి. హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మనాలి. ఇక్కడ అందమైన లోయలు, పచ్చని చెట్లు , ఎత్తైన కొండలు, మనువు దేవాలయం వంటివి చాలా ప్రసిద్ధి చెందినవి. అందువలన ఆనందంగా కుటుంబం లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి.

అరకు : ఏపీలోని అరకు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. డిసెంబర్ నెలలో మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో కానీ, స్నేహితులతో కానీ డిసెంబర్ నెలలో ఈ ప్రదేశానికి వెళ్లితే ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. చాలా బెస్ట్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.

హంపి : కర్ణాటకలోని ఒక చారిత్రక ప్రదేశం హంపి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నది, అద్భుతమైన ఆలయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ నెలలో ఇక్కడికి వెళ్లితే మీకు ఇది ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

కేరళ : అంద్భతమైన , అందమైన పర్యాటక ప్రాంతాల్లో కేరళ ముందు ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎత్తైన కొండలు, అందమైన చెట్లు. నదులు, దగ్గరిలోని బీచ్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందువలన డిసెంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసుకునే వారికి ఇది చాలా బెస్ట్ ప్రదేశం