Curd Drinks Facts: రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఇలాంటి వ్యాధులన్నీ హామ్‌ ఫట్!

|

Oct 31, 2024 | 11:36 AM

కొందరికీ భోజనంలో ఎన్ని పదార్థాలు తిన్నప్పటికీ ఒక్క ముద్ద పెరుగన్నం తిననిదే సంతృప్తినివ్వదు. నిజానికీ పెరుగు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పెరుగు అన్నంలో తినటం కంటే..పెరుగును తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. పెరుగు తాగడం వల్ల అందులో ఉండే ప్రోబయోటిక్స్‌ నేరుగా శరీరానికి అందడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. రోజు పెరుగు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
రోజూ పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి.. మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.

2 / 5
పెరుగులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకరమైన ఎముకల వ్యాధులను కూడా సులభంగా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

3 / 5
పెరుగులో ప్రోటీన్‌ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు తాగడం వల్ల ఆకలిని తగ్గించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజు పెరుగును తాగడం వల్ల చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. దీంతో పాటు మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

5 / 5
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.కాబట్టి, రోజు పెరుగు తాగడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది.