
మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా రంగస్థలం మూవీలో చెర్రీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతలా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు కూడా కథల సెలక్షన్ విషయంలో ఆచీ తూచీ అడుగులు వేస్తూ, భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే చాలా మంది చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే ఛాన్స్ రామ్ చరణ్‌కి కూడా ఉంది, చిరంజీవి తనయుడిగా ఆ లెగసీ ఉందని చెప్పుకొస్తున్నారు.

బాహుబలి సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. టాప్ రెంజ్‌లో కొనసాగుతునున్నాడు. అంతే కాకుండా నటన, కామెడీ టైమింగ్ అన్నింట్లో ప్రభాస్ ముందు ఉంటాడు. దీంతో చాలా మంది చిరంజీవి తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ అయ్యేది తప్పకుండా ప్రభాసే అంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే, తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ హీరో త్వరలో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీతో అభిమానుల ముందుకు రానున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెల కొననున్నాయి. అయితే చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే ఛాన్స్ ఈ హీరోకు కూడా ఉందంటున్నారు అభిమానులు.

టాలీవుడ్ స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తారక్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద ఉండే సందడే వేరుంటుంది. ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకోవడమే కాకుండా, డైలాగ్ డెలవరీ, కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా తన అభిమానులపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. అందుకే ఈ హీరో అంటే చాలా మంది అమితమైన ఇష్టం ఉంటుంది. ప్రస్తుతం ఈ హీరో కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. కాగా, ఈ హీరోకు కూడా మెగాస్టార్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని నెట్టింట టాక్.

పుష్ప, పుష్ప 2 సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అంతే కాకుండా నటన పరంగా కూడా చాలా అద్భుతంగా నటిస్తాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఈ హీరో కూడా మెగాస్టార్ రేస్‌లో ఉండే ఛాన్స్ ఉంది.