Vijay Deverakonda Rashmika: సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా.. కానీ మా అమ్మ.. విజయ్ దేవరకొండ..

Updated on: Oct 05, 2026 | 1:36 PM

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిరంతరం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి రణబాలి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

1 / 5
 టాలీవుడ్ మోస్ట్ లవబుల్ జంటలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఒకటి. ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు తమ ప్రేమ, పెళ్లి గురించి, అలాగే రణబాలి సినిమా విశేషాలు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన వివాహ ఆలోచనల గురించి మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ తనకు రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలున్నాయని సరదాగా వెల్లడించారు.

2 / 5
ఒక వైపు, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, బీచ్‌ ఒడ్డున షార్ట్స్‌తో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. "చాలా సింపుల్ గా చేసుకుందాం" అని తన మొదటి ఆలోచనను పంచుకున్నారు. అయితే ఈ ఆలోచన తన తల్లికి నచ్చలేదని.. పది రోజులు ఏడ్చిందని అన్నారు పెద్ద కొడుకు పెళ్లి ఇట్లా చేస్తే ఎలా అని గొడవ చేసిందని సరదాగా చెప్పారు. దీంతో ఇలా కాదు కింగ్ లా దిగాలని ఒంటిపై బంగారం వేసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు విజయ్.

3 / 5
రష్మిక మందన్న వివాహ వేడుకలకు తన విధానాన్ని వివరించారు. పెళ్లి ఏర్పాట్లు, బాధ్యతలను ఇతరులకు అప్పగించి, ఆ మూడు రోజులు తాను పూర్తిగా వేడుకను ఆస్వాదించాలనుకుంటున్నానని తెలిపారు. "ఆ త్రీ డేస్ పెళ్లి త్రీ డేస్ నాకు అసలు ఎంజాయ్ చేయాలి" అని ఆమె రణబాలి చిత్రయూనిట్ ను అడిగినట్లు తెలిపారు. వేడుక ముందు, తర్వాత అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తానని, కానీ పెళ్లి రోజులు మాత్రం స్వేచ్ఛగా ఉండాలనుకున్నాని అన్నారు.

4 / 5
వంట విషయానికి వస్తే, రష్మిక ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాన్‌కేక్‌లు బాగా చేస్తారని విజయ్ చెప్పారు. అయితే, ఆమె వంట చేసేటప్పుడు వంటగదిని చాలా గందరగోళంగా మారుస్తుందని సరదాగా అన్నారు. "కిచెన్ షెల్ఫ్ కి మేడమ్ అక్కడ కుకింగ్ చేసిందంటే అక్కడ ఏదో వార్ జరిగినట్టు ఉంటది" అని విజయ్ వివరించారు. రష్మిక పాన్‌కేక్‌లను విజయ్ తల్లి, తండ్రి కూడా ఎంతగానో ఇష్టపడతారని, తరచుగా ఆమెను చేయమని అడుగుతుంటారని తెలిపారు.

5 / 5
రణబాలి సినిమా గురించి మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలోని సింగనమల, పుట్టపర్తి ప్రాంతాలతో కథకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. పుట్టపర్తి తన జీవితంలో ఒక పెద్ద భాగమని, ఈ సినిమాలో దానికి సంబంధించిన ఒక డైలాగ్ ఉందని విజయ్ పేర్కొన్నారు. తన తండ్రి శ్రీ శ్రీ పుస్తకాలు, కమల్ హాసన్ ఆకలి రాజ్యం వంటి సినిమాల ద్వారా తనను రచన, కథలు చెప్పడం, సోషల్ అవర్‌నెస్ ఉన్న సినిమాల వైపు ఎలా ప్రేరేపించారో పంచుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us