ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ మిస్ అయ్యా.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్

Updated on: Oct 21, 2026 | 1:58 PM

సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకరి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంటాయి. మరికొన్ని చిత్రాలు నటీనటుల జీవితాల్లో ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఈ జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చింది.

1 / 5
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకరి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంటాయి. మరికొన్ని చిత్రాలు నటీనటుల జీవితాల్లో ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఈ జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా మరో నటిని అనుకున్నారట. 

2 / 5
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గీత గోవిందం 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే వీరిద్దరి ఆన్‌స్క్రీన్ జోడీకి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మొదట నటి ఐశ్వర్య అర్జున్‌ను సంప్రదించినట్లు ఆమె వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

3 / 5
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా కుమార్తె అయిన ఐశ్వర్య అర్జున్.. తన సినిమాల ప్రమోషన్ల సందర్భంగా గీత గోవిందం గురించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా తన ఖాతాలో పడాల్సిందని, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని ఆమె చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ చిత్రానికి పలువురిని పరిశీలించి చివరకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు. గీత గోవిందం సినిమా తనకు దక్కకపోవడంపై ఐశ్వర్య అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

4 / 5
తాను చేయలేకపోయిన కొన్ని సినిమాలు ఆ తర్వాత పెద్ద విజయాలు సాధించాయని ఆమె పేర్కొంది. దీంతో విజయ్ దేవరకొండ పక్కన రష్మిక స్థానంలో ఐశ్వర్య నటించి ఉంటే ఎలా ఉండేదనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇక గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ కలిసి నటించారు.

5 / 5
ఈ రెండు సినిమాలతో వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. రీసెంట్ గా రణబాలి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా.. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us