Directors: ఆ డైరెక్టర్స్‌ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేనా.? ఛాన్స్ ఉందా.? క్రిటిక్స్ మాటేంటి.?

|

Oct 22, 2024 | 8:01 AM

ఒకప్పుడు బాక్సాఫీస్ నెంబర్స్‌ను శాసించిన కొంత మంది దర్శకులు ఇప్పుడు టఫ్‌ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. స్టార్స్‌ను తయారు చేసిన ఇమేజ్‌ ఉన్నా.... ఇప్పుడు స్టార్ హీరోల డేట్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వటంలో ఫెయిల్ అయిన ఆ డైరెక్టర్స్‌, మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

1 / 5
 కృష్ణవంశీ, వినాయక్‌, పూరీ జగన్నాథ్‌, శ్రీనువైట్ల, సురేందర్‌ రెడ్డి... వీళ్లంతా ఒకప్పుడు కమర్షియల్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిన వారే. అప్పటి వరకు ఓ మూసలో పోతున్న తెలుగు సినిమాకు కొత్త దారి చూపించిన వారే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆడియన్స్‌ అభిరుచికి తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వలేకపోయిన ఈ టాప్‌ డైరెక్టర్స్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

2 / 5
కృష్ణవంశీ, వినాయక్‌ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లు గడిచిపోయింది. అసలు వీళ్ల లాస్ట్ హిట్ ఏంటో ప్రేక్షకులు కూడా మరిచిపోయారు. మధ్యలో సక్సెస్‌ కోసం ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా అవి వర్క్ అవుట్ కాకపోవటంతో వీళ్లు మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందా..? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

3 / 5
శ్రీనువైట్ల, పూరీ జగన్నాథ్, సురేందర్‌ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఈ దర్శకులు, ఇప్పుడు సక్సెస్‌ వేటలో తడబడుతున్నారు. వరుస దండయాత్రలు చేస్తున్నా ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం రావటం లేదు. అయినా తమ వంతుగా ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు కష్టపడుతున్నారు.

4 / 5
  ప్రస్తుతం ఫెయిల్యూర్స్‌లో ఉన్నంత మాత్రాన వీళ్ల పనైపోయినట్టే అనుకోవాడానికి లేదంటున్నారు విశ్లేషకులు. సరైన కాంబో సెట్ అయితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వటం కష్టమేం కాదన్నది క్రిటిక్స్ మాట. కానీ ఆ కాంబో సెట్ అవ్వటమే కష్టంగా ఉంది.

5 / 5
ప్రజెంట్ ఈ దర్శకుల ఫామ్‌ చూసి స్టార్‌ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. పాత పరిచయంతో ఎవరైన ఇవ్వాలనుకున్నా... ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చేంత ఖాళీగా ఏ హీరో లేరు. మరి ఈ సిచ్యుయేషన్‌ నుంచి మన దర్శకులు బయటపడతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.