LPG Cylinder: గ్యాస్ సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?

Updated on: Mar 20, 2026 | 9:52 PM

LPG Cylinder: ఒకసారి కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకుంటే కంపెనీలకు దానిని సరఫరా చేయడం సులభం అవుతుంది. ఈ పరిశోధన ఆధారంగా, ఒక గ్యాస్ సిలిండర్ నెల లేదా నెలన్నర పాటు వస్తుందని గ్యాస్ ఏజెన్సీ గ్రహించింది. దీని కారణంగా సరఫరా లెక్కలను సర్దుబాటు..

1 / 5
 LPG Cylinder: ప్రస్తుతం ఎల్పీజీ కొరత కారణంగా వినియోగదారులు బారులు తీరుతున్నారు. అయితే ఎల్పీజీ సిలిండర్‌లో ఎప్పుడూ 14.2 కేజీల గ్యాస్ ఎందుకు ఉంటుంది? అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఎల్పీజీ సిలిండర్‌లో 14 కేజీలు లేదా 15 కేజీల గ్యాస్ ఎందుకు ఉండదు? ఈ సంఖ్య కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ ఎల్పీజీ సిలిండర్ ఎప్పుడూ 14.2 కేజీలు ఎందుకు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం..

2 / 5
 14.2 కిలోల గ్యాస్‌ను ఉంచాలనే నిబంధన ఏదీ లేదు. ఈ నిర్ణయాన్ని మార్చవచ్చు. కానీ దాని వెనుక ఒక కారణం ఉంది. సామాన్యుడు గ్యాస్ సిలిండర్‌ను సులభంగా ఉపయోగించగలగాలి. దానిని రవాణా చేయడమే కాకుండా సిలిండర్‌ను ఇంటికి కూడా తీసుకువెళ్లగలగాలి. వినియోగదారుడి జేబుపై ఎలాంటి అదనపు భారం ఉండదు. అందుకే ఈ సిలిండర్‌ను ప్రామాణికంగా పరిగణిస్తారు. భారతదేశంలో గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ల వాడకం 1950వ దశకంలో ప్రారంభమైంది. ఆ సమయంలో బర్మా షెల్ అనే విదేశీ సంస్థ గ్యాస్‌ను సరఫరా చేసేది. ఆ సమయంలో సిలిండర్ పరిమాణం, బరువును నిర్ధారించిన మొదటి సంస్థ ఇదే. తరువాత ఈ సంస్థ పేరును భారత్ పెట్రోలియం (BPCL)గా మార్చారు.

3 / 5
 కారణాలు ఏమిటి?: అధికారిక సోర్సులైన BIS, PIB, లీగల్ మెట్రాలజీ వంటి వాటిలో ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.. భారత దేశం అంతటా ఇళ్లలో వాడుకునే సిలిండర్‌లో గ్యాస్ 14.2 కేజీలే ఉంటుంది. ఇది కాకుండా ఇళ్లలోనే వాడుకునేందుకు 5 కేజీల సిలిండర్ కూడా ఉంటుంది. ఇది ఒకరు లేదా.. ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఫ్యామిలీ కోసమైతే 14.2 కేజీల సిలిండరే సరైనది. ఆ మాత్రం అవసరం అవుతుంది. ఇంతకీ 14.2 కేజీల బరువుకి కారణం సేఫ్టీ, ఇంజనీరింగ్ లెక్కలే.

4 / 5
 ఆ సమయంలో బర్మా షెల్ కంపెనీ మూడు ప్రధాన కారణాలను దృష్టిలో ఉంచుకుని 14.2 కిలోల బరువును నిర్ధారించింది. ఇలా నీరులా ఉండే గ్యాస్ బరువు సిలిండర్‌లో 14.2 కేజీలు ఉంటుంది. గ్యాస్‌తో కలిపి సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉంటుంది. ఇంత కంటే ఎక్కువ బరువు ఉంటే.. సిలిండర్‌ని మొయ్యడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో.. ఈ బరువును సెట్ చేశారు. ఆనాటి సర్వే ప్రకారం.. ఈ గ్యాస్ ట్యాంక్‌ను ఎత్తగలిగారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్‌ బరువు 30 కిలోల కంటే ఎక్కువగా ఉంటే దానిని ఎత్తడం, మోయడం కష్టమయ్యేది. రెండవ ముఖ్య కారణం ఏమిటంటే, ఆ సమయంలో ఒక కుటుంబం  అవసరాలను అంచనా వేసేవారు. ఆ సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు ఎంత గ్యాస్ అవసరమవుతుందో నిపుణులు అంచనా వేశారు. ఈ గ్యాస్ సుమారు 30 నుండి 45 రోజుల వరకు సరిపోతుందని పరిశోధనలో తేలింది. అంటే, ఒకసారి గ్యాస్ నింపితే, అది నెలకు సరిపోతుంది.

5 / 5
 ఒకసారి కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకుంటే కంపెనీలకు దానిని సరఫరా చేయడం సులభం అవుతుంది. ఈ పరిశోధన ఆధారంగా, ఒక గ్యాస్ సిలిండర్ నెల లేదా నెలన్నర పాటు వస్తుందని గ్యాస్ ఏజెన్సీ గ్రహించింది. దీని కారణంగా సరఫరా లెక్కలను సర్దుబాటు చేయడం సాధ్యమైంది. ఈ విధానం చాలా సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది.

Follow Us