
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆధార్ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎం ఆధార్ పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆధార్‌కు సంబంధించిన ఆన్‌లైన్ సేవలన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఈ యాప్ ద్వారా మీరు సింపుల్‌గా ఆధార్ బయెమెట్రిక్స్ వివరాలను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

ఆధార్‌ను సురక్షితంగా ఉంచడానికి, యూజర్లకుక మరింత కంట్రోల్‌ను అందించడానికి యూఐడీఏఐ ఆధార్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. దీని వల్ల మీ ఆధార్‌ను వేరేవారు ఉపయోగించుకోలేరు. లాక్ చేసుకోవడం వల్ల కొన్ని ఫీచర్లు పనిచేయకుండా ఆగిపోతాయి. దీని వల్ల మీ ఆధార్‌కు భద్రత ఉంటుంది.

మీరు ఆధార్‌ను లాక్ చేసినప్పుడు మీ ఆధార్ నెంబర్ యూఐడీని ఉపయోగించి చేసే పనులను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీని వల్ల వివిధ సేవల కోసం మీ గుర్తింపు ధృవీకరించడానికి ఎంటీటీలు మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించలేరు. ఆధార్ యాప్‌ను ఉపయోగించి మీరు సులువుగా లాక్ చేసుకోవచ్చు.

తొలుత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి. ఎంఆధార్ అని టైప్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. సర్వీసెస్ విభాగానికి వెళ్లి ఆధార్ లాక్ లేదా అన్ లాక్ అని ఉండే ఆప్షన్‌ను ఎంచుకోండి.

లాక్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకుని స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి. ధృవీకరణ కోసం మీ ఆధార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ ఆధార్ లాక్ అవ్వుతుంది. ఆ తర్వాత మీకు అవసరమైన సమయంలో తిరిగి ఇదే యాప్ ద్వారా ఈజీగా అన్ లాక్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌ను వేరేవాళ్లు ఉపయోగించడానికి వీలుపడదు.