Banks Close: వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే అలర్ట్ అవ్వండి..

Updated on: May 06, 2026 | 8:53 AM

ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. నాలుగు రోజుల పాటు బ్యాంకులు వరుసగా మూతపడనున్నాయి. ఈ మేరకు ఎస్బీఐ ఉద్యోగులు ప్రకటన చేశారు. తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.

1 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 25,26వ తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఈ నెలలో వరుసగా నాలుగు రోజుల పాటు ఎస్బీఐ బ్యాంకులు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. దేశంలోనే అదిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బీఐకి పేరుంది. ఎక్కువమంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంక్ కూడా ఇదే. నాలుగు రోజులు మూసివేస్తే కోట్లాదిమంది ఖాతాదారులపై ప్రభావం పడనుంది. బ్యాంకు సేవలు పొందటంలో కస్టమర్లకు అంతరాయం కలిగే అవకాశముంది.

2 / 5
బ్రాంచ్ సంబంధిత లావాదేవీలు జరిపే కస్టమర్లకు సేవలు నిలిచిపోనున్నాయి. లోన్లు, బ్యాంక్ డ్రాఫ్ట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ పనులకు అంతరాయం కలగనుంది. దీంతో ఎస్బీఐ కస్టమర్లు దీనిని గమనించాల్సిన అవసరముంది. ఎస్బీఐ ఉద్యోగులు మొత్తం 16 డిమాండ్లను ముందుకు తెచ్చారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో.. కొత్త నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెకు దిగాలని పిలుపునిచ్చారు.

3 / 5
ఇక భద్రతా సిబ్బందిని పెంచడం, వేతనం వ్యత్యాసాలను తొలగించడం వంటి అంశాలపై సమ్మె చేపడుతున్నారు. ఇక వైద్య ప్రయోజనాలు, పని పరిస్థితులను మెరుగుపర్చడం వంటి వాటిని ఉద్యోగుల సంఘం కోరుతోంది. ఇక పెన్షన్ నిబంధనల్లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జాతీయ పెన్షన్ వ్యవస్థలో వెసులుబాటు, మెరుగైన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పెన్షన్ లెక్కింపు వ్యవస్థలో మార్పులు, మెరుగైన కెరీర్ గ్రోత్ వంటివి డిమాండ్ చేస్తున్నారు.

4 / 5
మే 23వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. ఇక మే 24వ తేదీ ఆదివారం సాధారణ సెలవు వచ్చింది. ఇక మే 25,26వ తేదీల్లో ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో మే 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు ఎస్బీఐ బ్రాంచులు మూతపడనున్నాయి. చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, నగదు లావాదేవీలు నిలిచిపోతున్నాయి. ఇక రుణాలు మంజూరు చేసేందుకు అందించాల్సిన డాక్యుమెంట్స్ పనులు కూడా ఆగిపోతాయి.

5 / 5
ఇక బ్యాకెండ్ ప్రాసెసింగ్‌లో జరగాల్సిన పనులు కూడా నిలిచిపోతాయి. దీంతో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు ముందుగానే పనులన్నీ పూర్తి చేసుకోవడం మంచిది. ఇక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు యథాతధంగా పనిచేయనున్నాయి. దీంతో కస్టమర్లు దీనిని ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోండి.

Follow Us