
పెన్షన్లు తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. పెన్షన్లు తీసుకునేవారు తాము జీవించే ఉన్నామని ధృవీకరించేందుకు ప్రతీ ఏడాది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం నవంబర్ 30 వరకు కేంద్రం గడువు విధించింది. ఈ డెడ్‌లైన్‌లోగా సమర్పించపోతే పెన్షన్ కట్ అవుతుందని కేంద్రం హెచ్చరించింది. నెలవారీ పెన్షన్లు పొందుతున్నవారు ఖచ్చితంగా ఈ గడువులోగా ఆన్లైన్ ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలని కోరింది.

ఒకవేళ సమర్పించడంలో విఫలమైన పెన్షన్ నిలిచిపోతుంది. అయితే జీవిత ధృవీకరణ పత్రం సమర్పించేందుకు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. పెన్షన్ ఆఫీసుకు లేదా బ్యాంకు, ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే దీనిని మొబైల్ ద్వారా సమర్పించవచ్చు. దీని వల్ల మీకు సమయం ఆదా అవుతుంది. ఆన్లైన్ ద్వారా సమర్పించడం చాలా సింపుల్.

ఉమాంగ్ యాప్, పోస్టల్ శాఖ ఉచిత డోర్‌స్టెప్ సర్వీస్, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా దీనిని సమర్పించే వీలుంది. కేంద్రం, రాష్ట్రం, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పించన్లు అందుకునేవారు దీనిని ప్రతీ ఏడాది అందించాలి. ఇది ఒక డిజిటల్ ధృవీకరణ పత్రం. ఆన్లైన్ ద్వారానే సులువుగా సమర్పించవచ్చు. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయడం, మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా పని పూర్తవుతుంది.

80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించేందుకు అక్టోబర్ 1 నుంచి అవకాశం కల్పించారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి నవంబర్ 1 నుంచి అవకాశం కల్పిస్తున్నారు. రెండు వర్గాల పెన్షనర్లకు నవంబర్ 30 వరకు సమయం ఉంది.

ఉమాంగ్ యాప్ తెరిచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ ఉపయోగించి పూర్తి చేసుకోవచ్చు. అలాగే పోస్టల్ శాఖకు కాల్ చేస్తే సిబ్బంది మీ ఇంటికి వచ్చి ప్రక్రియ పూర్తి చేస్తారు. దీని వల్ల మీరు పోస్టాఫీసులను సంప్రదించాల్సిన పని ఉండదు.