Bank Holidays: అలర్ట్.. అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు లిస్ట్ ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిరోజులంటే..?

Updated on: Sep 30, 2026 | 5:44 PM

అక్టోబర్‌లో దసరా పండుగ ఉండటంతో బ్యాంక్ సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు గాంధీ జయంతి రానుండటంతో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెలవుల కారణంగా ముందుగానే లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

1 / 5
బ్యాంక్ సెలవులు ప్రతీ నెలా మారుతూ ఉంటాయి. దీంతో సెలవుల గురించి ప్రతీ ఒక్క బ్యాంక్ ఖాతాదారుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయి..? ఏ రోజు మూసి ఉంటాయి? అనేది తెరుచుకోవడం ద్వారా ముందుగానే లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు. అక్టోబర్‌లో గాంధీ జయంతితో పాటు దసరా, బతుకమ్మ, దుర్గాపూజ లాంటి పెద్ద పండుగలు వస్తుండటంతో బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి.

2 / 5
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. రాష్ట్రాల పండుగలు, ప్రాంతీయ పండుగలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సెలవులు ఉండవు. జాతీయ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ప్రాంతీయ సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతాయి. అక్టోబర్‌లో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి చూద్దాం.

3 / 5
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవ్. జాతీయ సెలవు కావడంతో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అక్టోబర్ 10, అక్టోబర్ 24 రెండో శనివారం, అక్టోబర్ 4,11, 18,25  ఆదివారం సాధారణ సెలవు దినాలు కావడంతో బ్యాంకులు ఉండవు. అక్టోబర్ 20 దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ అవుతాయి.

4 / 5
అక్టోబర్ 19న దుర్గాష్టమి సందర్భంగా అగర్తలా, భువనేశ్వర్, చెన్నై, కోల్‌కతా, పాట్నాలలో బ్యాంకులు మూతపడనుండగా.. అక్టోబర్ 21న విజయదశమి, దుర్గాపూజ పొడిగింపుగా బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురంలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అక్టోబర్ 22, 23 తేదీల్లో గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు ఉండవు. అక్టోబర్ 26న లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

5 / 5
అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు ఎక్కువగా ఉండటంతో  లోన్ ప్రాసెసింగ్, నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్స్ వంటివి ముందే ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. సెలవు రోజుల్లో ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us