PNG Connection: పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి..? ఛార్జీలు ఎంత..?

Updated on: Mar 22, 2026 | 11:59 AM

గ్యాస్ కొరత క్రమంలో పైప్‌లైన్ గ్యాస్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటివరకు ఈ గ్యాస్ గురించి చాలామందికి అవగాహన లేదు. కానీ ఇప్పుడే ఇది హాట్ టాపిక్‌గా మారింది.

1 / 5
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా సామాన్యులను వేధిస్తోంది. గ్యాస్ బండ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.వెయ్యి ఉండే సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలు పెట్టి కొనుగోలు చేయల్సి వస్తోంది. అంత ఖర్చు పెట్టినా గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పైప్డ్ గ్యాస్‌(PNG)కి మారాలని చూస్తున్నారు. ఈ కనెక్షన్ ఎలా పొందాలనేది చూద్దాం.

2 / 5
ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఉండి పీఎన్‌జీ పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే.. ముందుగా మీ ఏరియాలో ఆ సౌకర్యం ఉందా.. లేదా అనేది చూడాలి. మీ ప్రాంతంలో పైప్ లైన్ గ్యాస్ సదుపాయం ఉందో.. లేదో చూడండి. ప్రస్తుతం నగరంలో గెయిల్, హెచ్‌పీసీఎల్ సంయుక్త సంస్థ అయిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్లను ఇస్తోంది.

3 / 5
మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్యాస్ కనెక్షన్ మంజూరు అవుతుంది. మీకు సిబ్బంది వచ్చి పైప్ లైన్ కనెక్షన్ అందిస్తారు. మీరు ఒకవేళ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు అయితే.. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అనుమతి ఇవ్వాలి.

4 / 5
ఇక పీఎన్‌జీ కనెక్షన్ కోసం ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, అద్దె ఇంట్లో ఉంటే యజమాని ఎన్‌ఓసీ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కనెక్షన్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుంది. ఇది రీఫండబుల్ అమౌంట్. ఇక వినియోగ డిపాజిట్ రూ.వెయ్యి ఉంటుంది. దీనిని కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఇక జీఎస్టీ, రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయి.

5 / 5
పీఎన్‌జీ కనెక్షన్ కోసం మొత్తం రూ.6 వేల నుంచి 7 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఇంటి లోపల పైప్ లోన్ వేసే పని ఉంటే రూ.5 నుంచి రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు అవుతుంది.  హైదరాబాద్‌లో 9 నుంచి 10 శాతం వరకు ఈ కనెక్షన్లు ఉన్నాయి.

Follow Us