
మనం ఏదైనా బ్యాంక్ లేదా ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థల నుంచి లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అనేది తప్పనిసరి. మినిమం 750 పాయింట్లకు మించి క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే ఏ బ్యాంక్ లోన్ మంజూరు చేయదు. అయితే రుణం పొందటానికే కాదు.. ఉద్యోగం పొందాలన్నా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. అవును.. ఇది అక్షరాలా నిజం.

బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలనుకునేవారికి సిబిల్ స్కోర్ మెరుగ్గు ఉండాల్సిందే. లేకపోతే మీకు బ్యాంకుల్లో ఉద్యోగం దొరకడం కష్టం. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగాల్లో సిబిల్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నారు. దీంతో మీరు బ్యాంకుల్లో ఉద్యోగం సాంపాదించాలంటే విద్యార్హతలు, అనుభవమే కాదు.. సిబిల్ స్కోర్ ఉండాల్సిందే.

బ్యాంకు ఉద్యోగం చేసేవారు తరచూ లక్షల విలువ చేసే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఇక కస్టమర్ల రహస్య సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగి అప్పుల్లో ఉంటే పనిపట్ల అంతికభావం ఉండదు. అంతేకాకుండా అప్పుల ఒత్తిడితో అక్రమాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సంస్థలు ఉద్యోగంలోకి తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ పరిశీలిస్తు్న్నాయి.

డీఫాల్ట్ లోన్లు ఉండటం, క్రెడిట్ కార్డ్ బకాయిలు ఎక్కువగా ఉండటం, రైట్ ఆఫ్ లోన్లు ఎక్కువగా ఉంటే ఉద్యోగం పొందటం కష్టమే. కొత్తగా ఉద్యోగం పొందే సమయంలోనే కాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందాలన్నా సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నాయి. దీంతో మీరు బ్యాంక్ ఉద్యోగంలో చేరాలనుకుంటే సిబిల్ స్కోర్‌పై ఫోకస్ పెట్టండి.

క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటే వాటిని చెల్లించండి. పాత లోన్లు ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. క్రెడిట్ రిపోర్టుల్లో తప్పులు ఉంటే సరిచేసుకోండి. ఈఎంఐలు ఉంటే వాటిని చెల్లించండి. ఈ జాగ్రత్తలు అన్నీ పాటించడం వల్ల మీరు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పొందుతారు.