Indian Railways: యువర్ అటెన్షన్ ప్లీజ్.! రైలు నెంబర్ 13228 ఎంత లేటు వచ్చిందో తెల్సా

Updated on: Feb 10, 2025 | 6:36 PM

నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే.? ఇండియన్ రైల్వే అనధికారిక వివరాల ప్రకారం.. ఆ ట్రైన్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

1 / 5
భారతీయ రైల్వే ప్రతీ రోజూ దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. దేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటగా..  రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీగా నమోదైంది.

2 / 5
ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్.. మన ఇండియన్ రైల్వేస్. ప్రతీరోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు రైళ్లు చేరుస్తుంటాయి. దేశంలోని వేలాది గమ్యస్థాల మధ్య ప్రయాణించే ఈ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం చేసుకోదగినదే.

3 / 5
అయితే అదే ఆలస్యంలో ఓ రైలు ప్రపంచ రికార్డు సృష్టిస్తే.. అవునండీ.! మీరు విన్నది నిజమే.. ఓ రైలు ఒకట్రెండు గంటలు కాదు.. పోనీ ఓ 5 గంటలు కూడా కాదు.. 72 గంటలు లేటైతే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

4 / 5
రైల్వే అనధికారిక వివరాల ప్రకారం.. 2017లో  రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా   వెళ్లాల్సిన 13228 నెంబర్ రైలు.. అత్యంత ఆలస్యంగా నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. లేటు అంటే.. మాములుగా కాదు 72 గంటలు లేటుగా వచ్చింది.!

5 / 5
 అయితే రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ పేరిట ఉంది. 2014 డిసెంబర్‌లో ఈ మహానంద ఎక్స్‌ప్రెస్ మొఘల్‌సరాయ్-పట్నా  మధ్య 71 గంటలు ఆలస్యంగా నడిచింది.