
బంగారం ధరలు కుప్పకూలాయి. మంగళవారం గోల్డ్ రేట్లు పెరగ్గా.. బుధవారం నాటికి తగ్గముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో గోల్డ్ రేట్లు తగ్గడం ఉపశమనం కల్గిస్తున్నాయి. బుధవారం వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,57,750 వద్ద కొనసాగుతోండగా.. మంగళవారం రూ.1,58,080 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.330 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,44,600 వద్ద ఉండగా.. నిన్న రూ.1,44,900 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.300 మేర తగ్గింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో బంగారం ధరలు మరింత తగ్గింది. నిన్న 24 క్యారెట్ల ధర రూ.1,59,820 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ రూ.1,58,950గా కొనసాగుతోంది. ఇవాళ రూ.870 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,700గా ఉండగా.. నిన్న రూ.1,46,500గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,57,750గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,600 వద్ద ట్రేడవుతోంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,58,240గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,060గా ఉంది.

ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉండగా.. మంగళవారం రూ.2.75 లక్షలుగా ఉంది. ఇవాళ ఒక్కసారిగా రూ.10 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర తగ్గింది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.75 లక్షలుగా కొనసాగుతోంది.