Gold Prices: సీన్ రివర్స్.. బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్.. ఒక్కసారిగా భారీగా పెరిగిన రేట్లు.. ఎంతంటే..?

Updated on: May 06, 2026 | 10:00 AM

బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతూ వస్తుండగా.. బుధవారం ఒక్కసారిగా బుడుగ పేలింది. ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్దం మొదలుకావడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

1 / 5
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగలింది. గత కొంతకాలంగా నెమ్మదించిన గోల్డ్ రేట్లు.. ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఒకేసారి ధరలు భారీగా పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారం కొనాలనుకునేవారికి ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్దం మొదలైన క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

2 / 5
బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,310 వద్ద కొనసాగుతోంది. మంగళవారం రూ.1,49,180 వద్ద స్థిరపడగా.. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.2130 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,700 వద్ద ఇప్పుడు కొనసాగుతోండగా.. నిన్న రూ.1,36,750 వద్ద స్థిరపడ్డాయి. నిన్నటితో చూసుకుంటే రూ.1950 పెరిగింది.

3 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా అవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,280 వద్ద ఉండగా.. నిన్న రూ.1,50,770 వద్ద ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రూ.2510 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర మంగళవారం రూ.1,38,200 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1,40,500కి చేరుకుంది. బుధవారం రూ.2300 పెరుగుదల నమోదైంది.

4 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,51,440 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,49,230 వద్ద స్థిరపడ్డాయి. నిన్నటితో పోల్చుకుంటే రూ.2210 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,850 వద్ద కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,51,310 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,38,700 వద్ద కొనసాగుతున్నాయి.

5 / 5
అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బెంగళూరులో కిలో వెండి రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతుండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద ఉంది. ఇవాళ కిలో వెండిపై రూ.10 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2.70 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.65 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో వెండిపై రూ.5 వేలు పెరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us