Subhash Goud | Edited By: Anil kumar poka
Nov 01, 2021 | 8:45 AM
Elon Musk: టెస్లా అధిపతి, ప్రపంచ నం.1 ధనవంతుడు ఎలాన్ మస్క్ మరో ఘనత దక్కించుకున్నారు. ప్రపంచంలో 300 బిలియన్ డాలర్లకు (రూ.22.50 లక్షల కోట్లు) పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా రికార్డు సాధించారు.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ వివరాల ప్రకారం.. శుక్రవారం నాటికి ఆయన వ్యక్తిగత సంపద 31,100 కోట్ల డాలర్లకు పెరిగింది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో టెస్లా షేర్లు మరింత పుంజుకోవడం ఇందుకు ఎంతగానో దోహదపడింది.
ప్రపంచ నం.2 ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆస్తి 195 బిలియన్ డాలర్ల కన్నా మస్క్ సంపద 116 బిలియన్ డాలర్లు అధికం.ఈజిప్ట్, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, గ్రీస్, ఖతార్, ఫిన్‌లాండ్ దేశాల జీడీపీ కంటే ఎక్కువ.
అంతేకాదు, గతంలో ఆయన మరొకరితో కలిసి ప్రారంభించిన పేపాల్, అంతర్జాతీయ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ల మార్కెట్ విలువ కంటే కూడా అధికంగా ఉంది. పాక్ ప్రజల మొత్తం సంపద కంటే మాస్క్‌కే 12 బిలియన్ డాలర్ల సంపద ఉంది.