
డీమార్ట్‌కు ఎక్కువమంది వెళుతుంటారు. ఇక పండుగల సమయాల్లో ఎక్కువ తాకిడి ఉంటుంది. ఇక్కడికి వెళ్లి పండక్కి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఒకేసారి తెచ్చుకుంటుంటారు. దసరా పండుగ ముగియగా.. త్వరలో అతిపెద్ద పండుగ దీపావళి వస్తోంది. ఈ పండుగ అంటేనే కొత్త బట్టలు, ఇంట్లో రకరకాల స్వీట్ల తయారీ, పూజలు వంటివి గుర్తుకొస్తాయి. ఈ పండుగ సమయాల్లో డీమార్ట్‌లో రూ.2 వేలలోపు బడ్జెట్‌లో అవసరమైన వస్తువులు ఎలా కొనాలనే చిట్కాలు చూద్దాం.

మీరు షాపింగ్ చేసేటప్పుడు కేవలం ఇంట్లోకి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. ఇంట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వస్తువులను కొనుగోల చేయకపోవడం మంచిది. పండుగ కోసం కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయండి. ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడానికి దూరంగా ఉండండి. మీరు కొనుగోలు చేసే వస్తువులపై నిజంగానే ఆఫర్ ఉందా.. లేదా ధర ఎక్కువ చూపించి తక్కువ ధరకు విక్రయిస్తున్నారా అనేది చెక్ చేసుకోండి.

బియ్యం, నూనె, బియ్యం, గోధుమ పిండి లాంటి వస్తువులను నెలకు సరిపోయేలా మాత్రమే కొనుగోలు చేయండి. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఒకే బ్రాండ్ ధర రాకుండా ఇతర బ్రాండ్ల ధరలను కూడా పరిశీలించండి. ఎందుకంటే కొన్ని బ్రాండ్లపై ప్రమోషనల్ లేదా భారీ తగ్గింపు ఆఫర్లు ఉంటాయి. దీని వల్ల మీ డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు.

షాపింగ్‌కు వెళ్లేటప్పుడు డీమార్ట్ వెబ్ సైట్ లేదా యాప్‌లో మీ సమీపంలోని స్టోర్‌ను సెలక్ట్ చేసుకుని ఆఫర్లను పరిశీలించండి. మీకు ఇంట్లోకి అవసరమైన వస్తువుల ధరలను తనిఖీ చేసుకోండి. హాఫ్ ప్రైస్ ఆఫర్, వన్ ప్లస్ వన్, భారీ డిస్కౌంట్లు ఏయే సరుకులపై లభిస్తున్నాయో పరిశీలించండి. అందులో మీకు కావాల్సిన వస్తువులను ఒక లిస్టులో రాసి పెట్టుకోండి. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.

మీకు రోజువారీ వంటకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. అంటే నిత్యావసర సరుకులకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లను కొనండి. ఆ తర్వాత పూజా సామాగ్రి, చిరుతిళ్ల వైపు చూడండి. నిత్యావసర సరుకులు పెద్ద ప్యాకెట్లు కాకుండా నెలకు సరిపోయేలా చిన్న ప్యాకెట్లు కొనుగోలు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు రూ.2వేలలోపు బడ్జెట్‌లో షాపింగ్ చేయవచ్చు.