
ప్రముఖ టెలికాం సంస్థ BSNL తమ కస్టమర్లకు మరో ఆఫర్ ఇచ్చింది. BSNL రీసెంట్గా తీసుకొచ్చిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్ డేట్‌ను మళ్లీ పొడిగించింది. ఈ ఆఫర్ కింద కేవలం రూ. 1కే వన్ మంత్ ప్లాన్‌ను అందించనుంది. ప్రస్తుతం భారత టెలికాం ఇండస్ట్రీలో ఇలాంటి ఆఫర్ ఏ కంపెనీ ఇవ్వట్లేదు. అయితే ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది.

ఆఫర్ ప్రత్యేకత ఏమిటి: ఈ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ ప్రత్యేకత ఏంటంటే.. కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారికి కేవలం రూ.1కే ఒక 24 రోజుల పాటు అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంటే ఒక్క రూపాయి పెట్టి రీఛార్జ్ చేసుకుంటే.. మీరు 24 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 2,400 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపవచ్చు.

ఆ ప్లాన్‌తో ఉన్న మరో బెనిఫిట్ ఏమిటంటే.. కేవలం 1 రూపాయికే రోజూ 1GB డేటా అందుతుంది. అంటే ఒక్క రూపాయి పెట్టి రీఛార్జ్ చేసుకుంటే.. 24 రోజుల పాటు 4G స్పీడ్‌తో 24GB డేటా వస్తుంది. 1GB డేటాకే ఇతర కంపెనీలు రూ.20 నుంచి 30 వసూలు చేస్తున్న ఈ రోజుల్లో రూ.1కే 24 GB డేటా ఇవ్వడం కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

అంతేకాదు ఈ ప్లాన్ తీసుకునే కస్టమర్లకు కంపెనీ ఫ్రీగా సిమ్ కార్డు కూడా ఇస్తోంది. ఇతర కంపెనీల్లా దీనికి మీరు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు.. కేవలం కొత్తగా BSNL వాడే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డు వాడుతున్న పాత కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాన్ని పొందలేరు.

చివరి తేదీ ఎప్పుడంటే?: ఇక ఈ ఆఫర్ డేట్‌ను నవంబర్ 9, 2026 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా BSNL తన అధికారిక ఎక్స్ అకౌంట్ వేదికగా వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకునేవారు మీ దగ్గర్లోని BSNL స్టోర్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను పొందవచ్చు. మరి ఇంకెందుకు లేటు కొత్తగా BSNLకు స్విచ్ అవుదామనుకునే మీ ఫ్రెండ్‌కు ఈ ఆర్టికల్ లింక్ షేర్ చేయండి.