
అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల అటుకులు, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం, కొద్దిగా కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, 10 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా నీరు కూడా తీసుకోవాలి.

అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం : ముందుగా అటుకులను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 10 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత ఎక్కువ నానబెడితే అటుకులు అంత మెత్తగా అవుతాయి కాబట్టి, మరి ఎక్కువ సేపు ఉంచకండి. ఆ తర్వాత పెసరపప్పును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

పెసరపప్పును ఇలా వేయించుకోవాలి : అర కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో బాగా ఉడికించాలి. అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికిస్తే చాలు. మళ్ళీ ఇంకో పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా వేసి అది బాగా వేడి అయినా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోకి వేయాలి. అవి రంగు మారిన తర్వాత దీనిలో శనగపప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించాలి.

పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యి కూడా దీనిలో వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా దీనిలో వేయాలి. అవి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని వేయించాలి.

ఉప్మా ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా ఉడికించిన పెసరపప్పును తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేసి, కొద్దీ సేపటి తర్వాత అటుకులు కూడావేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో రెండు, మూడు స్పూన్లు నీరు చల్లి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది.