
సమ్మర్‌ను తలపించే ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షంతో పాటు.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు సూచనలు చేసింది.

ఇదిలాఉంటే.. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. మంగళవారం (20-10-26) నాడు అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలియజేసింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అప్రమత్తంతగా ఉండాలని సూచించింది.