‘కరోనా వైరస్ పాండమిక్’ నడుమ పార్లమెంట్ ప్రారంభం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం..

'కరోనా వైరస్ పాండమిక్' నడుమ పార్లమెంట్ ప్రారంభం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 10:33 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం ఈ సెషన్ లో ముఖ్య విశేషం. రాజ్యసభ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు, లోక్ సభ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు కొనసాగనున్నాయి. సమావేశాలకు ముందు మాట్లాడిన ప్రధాని మోదీ..చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. కాగా 18 బిల్లులు లిస్ట్ ఎజెండాలో ఉన్నాయి. లడాఖ్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణ, కరోనా వైరస్, ఎకానమీ  ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి.

నాలుగు గంటల సిటింగ్స్ ఉంటాయని, వారంలో ఏడు రోజులూ సభా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి, కేవలం లిఖిత ప్రశ్నలు, వాటికి సమాధానాలను మాత్రమే అనుమతించనున్నారు.  క్వశ్చన్ అవర్ ను రద్దు చేయడంపట్ల ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పైగా ఎప్పటి మాదిరి సాగే అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఈ సారి రద్దు చేశారు. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్న ఎంపీల్లో బీజేపీ ఎంపీ సుకాంత్ మజుందార్ ఒక్కరే పాజిటివ్ గా తేలారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!