‘వన్ నేషన్ – వన్ ఐడెంటిటీ కార్డ్’: అమిత్ షా

‘వన్ నేషన్-వన్ ఐడెంటిటీ కార్డ్’ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ప్రతిపాదన తెచ్చారు. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ కార్డు.. ఇలా ఈ అవసరాలన్నింటికీ ఒకే గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చు. అది సాధ్యమవుతుంది కూడా’ అని బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు(మల్టీపర్పస్‌ ఐడీ కార్డ్‌) ప్రతిపాదన గురించి అమిత్ […]

'వన్ నేషన్ - వన్ ఐడెంటిటీ కార్డ్': అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 4:17 PM

‘వన్ నేషన్-వన్ ఐడెంటిటీ కార్డ్’ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ప్రతిపాదన తెచ్చారు. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ కార్డు.. ఇలా ఈ అవసరాలన్నింటికీ ఒకే గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చు. అది సాధ్యమవుతుంది కూడా’ అని బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు(మల్టీపర్పస్‌ ఐడీ కార్డ్‌) ప్రతిపాదన గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా 2021 జనాభా లెక్కింపు గురించి కూడా అమిత్‌ షా ప్రస్తావించారు. ఈ సారి జనగణనను డిజిటల్‌ రూపంలో చేపడతామని  అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. ‘2021 జనాభా లెక్కింపులో మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తాం. అంతేకాదు తొలిసారిగా జాతీయ జనాభా పట్టీ (NPR)ని రూపొందిస్తామని అమిత్ షా వెల్లడించారు. దేశంలో ఎవరైనా ఓ వ్యక్తి చనిపోతే ఆ వివరాలు ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకొస్తామన్నారు హోంమంత్రి అమిత్ షా.

Latest Articles