దీని విషం 15 నిమిషాల్లో ప్రాణాలు తీస్తుంది..! ఈ జీవిని ఎప్పుడైనా చూశారా..?

|

Nov 19, 2021 | 6:01 AM

Funnel Web Spider: ప్రపంచంలో చాలా విషపు జీవులు ఉన్నాయి. వాటి గురించి మీరు తరుచుగా వింటూనే ఉంటారు. పాము, తేలు విషానికి సంబందించిన కొన్ని సంఘటనలు చూసే

దీని విషం 15 నిమిషాల్లో ప్రాణాలు తీస్తుంది..! ఈ జీవిని ఎప్పుడైనా చూశారా..?
Spider
Follow us on

Funnel Web Spider: ప్రపంచంలో చాలా విషపు జీవులు ఉన్నాయి. వాటి గురించి మీరు తరుచుగా వింటూనే ఉంటారు. పాము, తేలు విషానికి సంబందించిన కొన్ని సంఘటనలు చూసే ఉంటారు. కానీ 15 నిమిషాల్లో మనిషిని చంపేసే సాలీడు గురించి మీకు తెలుసా..! మెగా స్పైడర్ అని పిలుస్తున్న ఈ సాలీడుని ఆస్ట్రేలియాలో గుర్తించారు. చాలా ప్రమాదకరమైన ఈ సాలీడు పేరు జెయింట్ ఫన్నెల్ వెబ్ స్పైడర్. దీనిని న్యూ సౌత్ వేల్స్‌లోని ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్‌కు విరాళం ఇవ్వడానికి ఒక వ్యక్తి తీసుకువచ్చారు. దాని విశేషాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

ఈ సాలీడుని చూసిన నిపుణులు ఆశ్చర్యపోయారు. ఈ సాలీడు 3 అంగుళాలు ఉంటుంది. దీని కోరలు 0.8 అంగుళాల పొడవు ఉంటాయి. ఇది మానవుని గోరుని కరుస్తుంది. ఈ స్పైడర్‌కి మెగా స్పైడర్ అని పేరు పెట్టారు. ఈ సాలీడు తన విషాన్ని మనిషి శరీరంలోకి వదిలేస్తే 15 నిమిషాల్లో మరణం ఖాయం అని చెప్పారు. ప్రస్తుతం ఈ సాలీడు విషాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. దీని నుంచి ఔషధం తయారు చేసే పనిలో ఉన్నారు. తద్వారా అనేక మంది ప్రాణాలను రక్షించవచ్చు.

ఇదిలా ఉంటే మరోవైపు శాస్త్రవేత్తలు ఒక వింత పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు వాటి యజమానితో మాట్లాడగలవు. శాస్త్రవేత్తలు ప్రోటోటైప్ డాగ్‌ఫోన్ పరికరాన్ని రూపొందించారు. ఇది కదలికను గుర్తించగలదు దీనిని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయవచ్చు. తద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇలీనా దీన్ని తయారు చేశారు.

ఢిల్లీలో పంజా విప్పిన కాలుష్య భూతం.. ఇంట్లో కూడా ఊపిరి తీసుకోలేని పరిస్థితులు.. కారణాలు ఇలా..?

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు