నీట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చూసుకోండి..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ 2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్​ 13, అక్టోబర్​ 14 రెండు ప్రయత్నాల్లో...

నీట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చూసుకోండి..
Follow us

|

Updated on: Oct 16, 2020 | 6:14 PM

NEET Result 2020 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ 2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్​ 13, అక్టోబర్​ 14 రెండు ప్రయత్నాల్లో పరీక్షలు రాసిన వారి ఫలితాలు ఇందులో ఉన్నాయి. అభ్యర్థులు వారి ర్యాంక్​లను ntaneet.nic.in or nta.ac.in లో తెలుసుకోవచ్చని తెలిపింది.

అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు గత వారంలోనే విడుదల కావల్సి ఉన్నాకొన్ని కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా పరీక్ష మిస్సైనవారికి రెండ్రోజుల క్రితం అంటే అక్టోబర్ 14న మరోసారి పరీక్ష నిర్వహించారు. కోవిడ్ వైరస్ సోకడం లేదా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న కారణంగా కొంతమంది విద్యార్ధులు సెప్టెంబర్ 13న నిర్వహించిన నీట్ పరీక్ష రాయలేకపోయారు.

ఇలాంటి విద్యార్దుల కోసం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 14న మరోసారి నిర్వహించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష కోసం 3 వేల 8 వందల కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు 90 శాతం అభ్యర్ధులు పరీక్షలు హాజరయ్యారు. కోవిడ్ 19 నిబంధనల మధ్య నీట్ పరీక్షను నిర్వహించారు.