కరోనా భయం: కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులు..

కరోనా వైరస్ రోజురోజుకు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్న విషయం తెలిసిందే. తోటి మనిషికి సహాయంగా ఉండాలన్న ఆలోచన కూడా కరోనా వైరస్ దరికి రానియడం లేదు. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో మనుషులు మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

కరోనా భయం: కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులు..
Follow us

|

Updated on: Sep 08, 2020 | 6:04 PM

కరోనా వైరస్ రోజురోజుకు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్న విషయం తెలిసిందే. తోటి మనిషికి సహాయంగా ఉండాలన్న ఆలోచన కూడా కరోనా వైరస్ దరికి రానియడం లేదు. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో మనుషులు మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలోని ఓ జిల్లాలో కరోనా సోకిన కుటుంబాన్ని వారిని గ్రామం నుంచి వెలి వేశారు. వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం కూసంగిలో దారుణం జరిగింది. కరోనా సోకిన కుటుంబసభ్యుల పట్ల సర్పంచ్‌, ఎంపీటీసీ దారుణంగా వ్యవహరించారు. గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ దుర్భాషలాడడంతో చేసేదేం లేక బాధిత కుటుంబం గ్రామ శివారులో పూరిగుడిసె వేసుకున్నారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులను కలిసిన రెవెన్యూ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు. బాధితులు గ్రామంలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. కాగా, ఇప్పటికే పది రోజులు గడిచిపోయింది ఇంకా నాలుగు రోజుల వరకు గ్రామ శివారు లోనే ఉంటామని చెప్పారు బాధితులు.

Latest Articles