ఏపీలో నివర్‌ తుఫాను తీవ్ర ప్రభావం.. ట్రిపుల్ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా..

దక్షిణాదిలో నివర్ తుఫాను విశ్వరూపం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నివర్‌ తుపాను ప్రభావం పరీక్షలపై పడింది.

  • Balaraju Goud
  • Publish Date - 5:08 pm, Fri, 27 November 20
ఏపీలో నివర్‌ తుఫాను తీవ్ర ప్రభావం.. ట్రిపుల్ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా..

దక్షిణాదిలో నివర్ తుఫాను విశ్వరూపం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నివర్‌ తుపాను ప్రభావం పరీక్షలపై పడింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు అనుకూల వాతావరణం లేకుండాపోయింది. దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ట్రిపుల్‌ ఐటీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ కన్వీనర్‌ డి.హరినారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. రేపు జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పరీక్షా కేంద్రాలు, ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రావాలని కన్వీనర్ సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.