బెంగాల్ లో మరో అల్-ఖైదా ఉగ్రవాది అరెస్ట్

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా జలంగి లో అల్-ఖైదాకు చెందిన మరో  ఉగ్రవాదిని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. ఇతడిని షమీమ్అన్సారీగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుబడిన టెర్రరిస్టుల్లో..

బెంగాల్ లో మరో అల్-ఖైదా ఉగ్రవాది అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 12:59 PM

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా జలంగి లో అల్-ఖైదాకు చెందిన మరో  ఉగ్రవాదిని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. ఇతడిని షమీమ్అన్సారీగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుబడిన టెర్రరిస్టుల్లో షమీమ్ పదవ వాడు. ఇటీవలే ఇదే జిల్లాలో ఆరుగురు టెర్రరిస్టులను, కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ సిబ్బంది అరెస్టు చేశారు. వీరినుంచి పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను, లాప్ టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పట్టుబడిన షమీమ్ అన్సారీని కోర్టులో హాజరు పరచనున్నారు. పాకిస్థాన్ లోని అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఇండియాలో విధ్వంసానికి పాల్పడాలన్నదే వీరి ఉద్దేశమని ఎన్ ఐ ఏ అధికారులు చెబుతున్నారు.  దేశంలో అమాయక ప్రజలను హతమార్చి, కీలక మైన కట్టడాలను నాశనం చేయాలన్న వీరి కుట్రను భగ్నం చేశామని అధికారులు వెల్లడించారు.

Latest Articles