అత్యాచార కేసులో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాయకుడు రాకీ మిట్టల్‌..!

|

Jan 15, 2025 | 2:30 PM

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ బడోలీ, సింగర్ రాకీ మిట్టల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన 2023 జులై 3న జరిగినట్లు యువతి పేర్కొంది. నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోలన్‌ ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ తెలిపారు.

అత్యాచార కేసులో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాయకుడు రాకీ మిట్టల్‌..!
Mohan Badoli
Follow us on

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీపై ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ప్రముఖ గాయకుడు రాకీ మిట్టల్‌‌తో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంది. ఈమేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీ పోలీస్ స్టేషన్‌లో వారిద్దరిపై అత్యాచారం కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, అత్యాచార ఘటన జూలై 7, 2023న జరగగా, ఎఫ్‌ఐఆర్ డిసెంబర్ 13, 2024న నమోదైంది.

కసౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, జూలై 3, 2023న ఇద్దరు స్నేహితులతో కలిసి హిమాచల్‌ను సందర్శించడానికి వచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె బస చేసిన హోటల్‌లో మోహన్ లాల్ బడోలీ, రాకీ మిట్టల్ కూడా ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు బయటకు వెళుతుండగా, మోహన్ లాల్ బడోలీ తనను తాను గొప్ప రాజకీయ నాయకుడిగా, రాకీ మిట్టల్ గొప్ప గాయకుడిగా పేర్కొన్నారు. అనంతరం మహిళలిద్దరినీ తన గదిలోకి తీసుకెళ్లి మద్యం తాగించారని మహిళ ఆరోపించింది.

బడోలి, మిట్టల్ కూడా తన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశారని ఆ మహిళ ఆరోపించింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు నోరు విప్పితే చంపేస్తామని, ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని సదరు మహిళ పేర్కొంది. అనంతరం మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హిమాచల్ పోలీసులు మోహన్ లాల్ బడోలి, రాకీ మిట్టల్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో మోహన్ లాల్ బడోలీ, రాకీ మిట్టల్ స్పందించలేదు. కాగా, ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మోహన్ లాల్ బడోలి హర్యానా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో సోనిపట్ జిల్లా రాయ్ స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోహన్ లాల్ బడోలీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అతని నాయకత్వంలో, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, బీజేపీ మూడవసారి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్ బడోలీ కూడా చాలా ప్రశంసలు పొందారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలీ పదవీకాలం మరోసారి పొడిగిస్తారని భావించారు. కానీ అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలతో, అతని ఇమేజ్ ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది. ఇక, రాకీ మిట్టల్ గాయకుడు, నటుడు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, రాకీ మిట్టల్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రాకీ మిట్టల్ కాంగ్రెస్ నేతల తరఫున ప్రచారం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..