ఎస్.ఆర్. బొమ్మై కేసు అంటే..నాడు ‘ సుప్రీం ‘ ఏం చెప్పిందంటే ?

|

Nov 13, 2019 | 6:03 PM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు న్యాయ సమ్మతమా, కాదా అన్నదానిపై తర్జనభర్జన జరుగుతున్న సమయంలో కొందరు నిపుణులు 1994 నాటి సుప్రీంకోర్టు వర్సెస్ బొమ్మై కేసులో కోర్టు ఇఛ్చిన తీర్పును ప్రస్తావించారు. అసలు ఆ కేసు పూర్వాపరాలేమిటి ? కర్నాటకలో 1988 ఆగస్టు 13, 1989 ఏప్రిల్ 21 మధ్య జనతాదళ్ సర్కార్ లో ఎస్.ఆర్. బొమ్మై సీఎంగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 356 అధికరణం కింద అదే ఏడాది అదే తేదీన ఆ ప్రభుత్వాన్ని గవర్నర్ […]

ఎస్.ఆర్. బొమ్మై కేసు అంటే..నాడు  సుప్రీం  ఏం చెప్పిందంటే ?
Follow us on

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు న్యాయ సమ్మతమా, కాదా అన్నదానిపై తర్జనభర్జన జరుగుతున్న సమయంలో కొందరు నిపుణులు 1994 నాటి సుప్రీంకోర్టు వర్సెస్ బొమ్మై కేసులో కోర్టు ఇఛ్చిన తీర్పును ప్రస్తావించారు. అసలు ఆ కేసు పూర్వాపరాలేమిటి ? కర్నాటకలో 1988 ఆగస్టు 13, 1989 ఏప్రిల్ 21 మధ్య జనతాదళ్ సర్కార్ లో ఎస్.ఆర్. బొమ్మై సీఎంగా ఉన్నారు. అయితే రాజ్యాంగంలోని 356 అధికరణం కింద అదే ఏడాది అదే తేదీన ఆ ప్రభుత్వాన్ని గవర్నర్ డిస్మిస్ చేశారు.. దాంతో రాష్ట్రపతి పాలన విధించారు. పెద్దఎత్తున పలువురు పార్టీ నాయకులు ఫిరాయింపులు జరపడంతో బొమ్మై ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, అందువల్ల ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామని అప్పటి కేంద్రం పేర్కొంది. కాగా- తన మద్దతుకు సంబంధించి జనతాదళ్ లెజిస్లేచర్ పార్టీ ఆమోదించిన తీర్మాన కాపీని బొమ్మై అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినప్పటికీ అసెంబ్లీలో బలనిరూపణకు ఆయనకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ దాన్ని తిరస్కరించారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బొమ్మై మొదట కర్ణాటక హైకోర్టుకెక్కారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేయడంతో.. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై తీర్పునిచ్చేందుకు అత్యున్నత నాయస్థానానికి ఐదేళ్లు పట్టింది. 356 ఆర్టికల్ కింద రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ రద్దుకు ఆ తీర్పు స్వస్తి చెప్పింది. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభేనని, అంతే తప్ప గవర్నర్ సొంత అభిప్రాయానికి తావు లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా గవర్నర్ రాజ్యాంగం మేరకే నడుచుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.