BJP MLA: భర్తతో గొడవ పడిన ఎమ్మెల్యే.. అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది.. ఆ తరువాత ఫోన్ చేయగా..

|

Aug 20, 2021 | 2:43 PM

BJP MLA: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే.. తన భర్తతో గొడవ పెట్టుకుని అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

BJP MLA: భర్తతో గొడవ పడిన ఎమ్మెల్యే.. అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది.. ఆ తరువాత ఫోన్ చేయగా..
Bjp Mla
Follow us on

BJP MLA: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే.. తన భర్తతో గొడవ పెట్టుకుని అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే.. సల్టోరా నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి.. అర్థరాత్రి 2.45 సమయంలో చెప్పాపెట్టుకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన సెక్యూరిటీ సిబ్బందికి కూడా ఎలాంటి సమాచారం అందించలేదు. దాంతో ఆమె ఫోన్‌కు కాల్ చేశారు. భర్త ఓ వైపు.. అధికారులు మరోవైపు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ఆమె గంగాజల్‌ఘాటి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ కమాండోలు గుర్తించారు. అయితే, ఆమె ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లడానికి భర్తతో జరిగిన గొడవే కారణమని ఎమ్మెల్యే చెబుతున్నారు. అర్థ రాత్రి సమయంలో బౌరి, ఆమె భర్తకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే ఆమె ఇంటినుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త, అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఆమెనే స్వయంగా తన సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి.. తాను గంగాజల్‌ఘాటి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందించారు. దాంతో ఆమె భర్త, అధికారులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే బౌరికి సర్దిచెప్పారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు ఆమె ఇంటికి చేరుకుంది.

పశ్చిమ బెంగాల్‌లోని సల్టోరా నియోజకవర్గానికి చెందిన చందన బౌరి రోజువారీ వేతన కూలి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచింది. అయితే, ఎన్నికల తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాణ హాణీ ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేల నివాసాల వద్ద ఇద్దరు సాయుధ కమాండోలను భద్రతగా ఏర్పాటు చేసింది. అయితే భర్తతో గొడవ నేపథ్యంలో వీరి కళ్లను గప్పి.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. చివరికి ఆమె ఆచూకీ తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్

KGF-2: సంచలనాల కేజీఎఫ్ 2.. సౌత్ శాటిలైట్ రేట్స్ ఎవరికి దక్కాయో తెలుసా ?

Viral Video: దోసెలు ఇలా కూడా వేయొచ్చా.? నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!