Viral Video: దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు.. ఎందుకో తెలిస్తే పరేషాన్‌! వీడియో

|

May 14, 2024 | 6:25 AM

బీహార్‌లోని ఉజియార్‌పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువ ఓటరు గేదెపై ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేసేందుకు ఇంత డిఫరెంట్ స్టైల్‌లో వచ్చిన యువకుడిని అందరూ వింతగా చూడసాగారు. జీవితంలో తొలిసారి ఓటు వేస్తున్నానని, అది ఎప్పటికీ గర్తుండి పోవాలని ఇలా వినూత్న రీతిలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చానని చెప్పడంతో విన్న..

Viral Video: దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు.. ఎందుకో తెలిస్తే పరేషాన్‌! వీడియో
Bihar Man Takes Buffalo Ride For Vote
Follow us on

బీహార్‌, మే 14: బీహార్‌లోని ఉజియార్‌పూర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువ ఓటరు గేదెపై ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేసేందుకు ఇంత డిఫరెంట్ స్టైల్‌లో వచ్చిన యువకుడిని అందరూ వింతగా చూడసాగారు. జీవితంలో తొలిసారి ఓటు వేస్తున్నానని, అది ఎప్పటికీ గర్తుండి పోవాలని ఇలా వినూత్న రీతిలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చానని చెప్పడంతో విన్న అంతా అవాక్కయ్యారు. బీహార్ రాష్ట్రంలోని ఉజియార్‌పూర్‌ సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సమస్తిపూర్‌ జిల్లాలోని ఉజియార్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. నల్ల చొక్కా, గ్రే కలర్‌ ప్యాంట్ ధరించి, తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు. ఇక దున్నపోతుకు తలకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. ఈ కింది వీడియోలో ఈ యువ ఓటర్‌ దున్నపోతుపై ఊరేగిన దృశ్యాలను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో 17.48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 13 మంది అభ్యర్థులు తమ గెలుపు కోసం ఎన్నికల బరిలోకి దిగారు. ఈ రాజకీయ పోరులో ముందంజలో ఉన్న కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వరుసగా మూడోసారి ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్ర హోం మంత్రి నిత్యానంద్ రాయ్ అభ్యర్థిత్వంపై ప్రముఖ ఆర్జేడీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి అలోక్ మెహతా పోటీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.