ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లో ఈ ఘటన షాకింగ్ వెలుగు చూసింది. ఒక అమ్మాయి ద్వారా యువకులందరికీ సోకినట్లు నైనిటాల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ప్రకటించారు. ఆ యువతికి హెరాయిన్ తీసుకునే అలవాటు ఉందని.. ఈ వ్యసనమే కొంప ముంచిందన్నారు. డబ్బుల కోసం.. తప్పుడు మార్గాలు తొక్కడం ద్వారా ఆమెకు HIV సోకిందన్నారు హెల్త్ ఆఫీసర్. ఆమె వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది యువకులు డబ్బు ఆశజూపి.. కొందరు డ్రగ్స్ ఆశచూపించి లోబర్చుకున్నట్లు తేల్చారు. ఇలా ఆమె ద్వారా యువకులందరికీ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు.
సాధారణంగా రాష్ట్రం మొత్తం ఏడాదికి 20 కేసులు వస్తుంటాయని.. ఇలా ఒకేసారి ఒకే ప్రాంతంలో 19మందికి ఎయిడ్స్ రావడంతో షాక్‌కు గురిచేస్తోంది. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధిసోకింది అనేది ఆరాతీస్తున్నారు. కేవలం రామ్‌నగర్ ప్రాంతంలో 17 నెలల్లో 45 కేసులు బయటపడ్డాయన్నారు అధికారులు. ఇప్పుడు వ్యాధిసోకిన వారు ఒక్కరొక్కరిగా అనారోగ్యం బారిన పడడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని వారికి టెస్టులు చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారిలో చాలామంది పెళ్లైన వారే అంటున్నారు పోలీసులు. అయితే ఎయిడ్స్ సోకిన వారికి ఒకే అమ్మాయి ద్వారా వచ్చినట్లు తెలియదని.. ఒకరి తెలియకుండా ఒకరితో ఆమె రిలేషన్ మెయింటైన్ చేయడంతో ఇలా జరిగిందంటున్నారు.
విచ్చలవిడి తనానికి వెళ్తే ఇలాంటి అనర్థాలే వస్తాయంటున్నారు ప్రభుత్వాధికారులు, డాక్టర్లు.. యువత నిగ్రహాన్ని పాటించాలని.. సురక్షిత చర్యలు తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు. యువతి వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెకు డబ్బులిస్తూ యువకులు అవసరాలు తీర్చుకున్నారని.. ఇప్పుడు పెను ప్రమాదంలో పడ్డారని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..