Bhadohi Murder: బైక్‌పై మృతదేహంతో నగరంలో తిరుగుతోన్న సేల్స్‌మెన్‌.. అనుమానంతో చెక్‌ చేయగా..

|

Sep 14, 2023 | 3:24 PM

త్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఇనుప బాక్స్‌లో ప్యాక్ చేసి బైక్‌పై తిప్పుతున్న సేల్స్‌ మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలా అమ్మాయి ఎవరు? హంతకుడు ఎవరు అనే కోణంలో విచారణ చేయగా థ్రిల్లర్‌ మువీని పోలిన కథ బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన వీరి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలో ఏం జరిగిందంటే..

Bhadohi Murder: బైక్‌పై మృతదేహంతో నగరంలో తిరుగుతోన్న సేల్స్‌మెన్‌.. అనుమానంతో చెక్‌ చేయగా..
Bhadohi Murder
Follow us on

లక్నో, సెప్టెంబర్ 14: ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఇనుప బాక్స్‌లో ప్యాక్ చేసి బైక్‌పై తిప్పుతున్న సేల్స్‌ మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలా అమ్మాయి ఎవరు? హంతకుడు ఎవరు అనే కోణంలో విచారణ చేయగా థ్రిల్లర్‌ మువీని పోలిన కథ బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన వీరి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలో ఏం జరిగిందంటే..

మరొకరితో మాట్లాడటం సహించలేకనే..

నిందితుడు ఉపేంద్ర మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలం క్రితం 16 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. క్రమంగా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం వారణాసిలోని మహామనపురి కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు. రాత్రి చీకటిపడిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లేవారు. ఆ క్రమంలో బాలిక మరో అబ్బాయితో చనువుగా మాట్లాడడం ఉపేంద్రకు నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. సెప్టెంబరు 1న బాలికను ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చాడు. ఫుడ్ ఆర్డర్ చేసి కలిసి తిన్నారు. భోజనం తర్వాత వీరిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. దీంతో ఆవేశానికి గురైన ఉపేంద్ర బాలిక గొంతు కోసి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత షాప్‌ నుంచి ఇనుప పెట్టె తెచ్చి మృతదేహాన్ని అందులో పెట్టాడు.

బైక్ వెనుక ఆ పెట్టెను ఉంచుకుని బనారస్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని గోపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదోహిలో జాతీయ రహదారి పక్కన లాలా నగర్‌లో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పారవేసి, బైక్ ట్యాంక్‌లో ఉన్న పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. బాలిక మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేలా దహనం చేశాడు. ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 2) ఇనుప పెట్టెలో సగం కాలిపోయిన బాలిక మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఇనుప పెట్టెను బైక్‌పై తీసుకెళ్తున్న ఉపేంద్రను పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ మీనాక్షి కాత్యాయన్ వెల్లడించారు. మృతురాలు వేరొకరితో చనువుగా మాట్లాడటం సహిచలేక ఆమె ప్రియుడు ఈ దారుణానికి పాల్పడినట్లు మీనాక్షి కాత్యాయన్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.