ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక..! అక్కడ కట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాలి.. లేదంటే చర్యలు..

Employees: వరకట్న వ్యవస్థని అంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కొత్త ఉత్తర్వు ప్రకారం.. 2004 సంవత్సరం తర్వాత

ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక..! అక్కడ కట్నం ఎంత తీసుకున్నారో లెక్క చెప్పాలి.. లేదంటే చర్యలు..
Employees

Updated on: Oct 25, 2021 | 12:08 PM

Employees: వరకట్న వ్యవస్థని అంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కొత్త ఉత్తర్వు ప్రకారం.. 2004 సంవత్సరం తర్వాత వివాహం చేసుకున్న అధికారులు, ఉద్యోగులు వివాహ సమయంలో పొందిన కట్నం వివరాలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఉద్యోగులకు, అధికారులకు నోటీసు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాలకు లేఖ పంపారు.

ఇందులో 2004 తర్వాత వివాహం చేసుకున్న ఉద్యోగులు, అధికారుల నుంచి వరకట్నం వివరాలను అడిగారు. వివిధ శాఖల్లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి శాఖాధిపతుల ద్వారా నోటీసులు పంపి సమాధానం చెప్పాలని కోరుతున్నారు. పెళ్లి అయిన సంవత్సరం, అప్పటి పరిస్థితి, కట్నం తీసుకున్న వివరాలు అందజేయాల్సిన ఉంటుంది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారో సమాచారం ఇవ్వలేదు.

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. మ్యానిఫెస్టోలో ఉద్యోగులు తమ వివాహ సమయంలో కట్నం తీసుకున్నారా లేదా అనేది చెప్పాలి. 31 ఏప్రిల్ 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించకపోతే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు అక్టోబర్ లోపు మేనిఫెస్టోను కంప్లీట్‌ చేయాలన్నారు. వరకట్న వ్యవస్థని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వు వివిధ ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపింది. సాంఘిక దురాచారమైన వరకట్న వ్యవస్థను అరికట్టడానికి యుపి ప్రభుత్వం1999లో వరకట్న నిషేధ చట్టం రూపొందించింది. మార్చి 31, 2004 న సవరణ చేసింది. దాని నిబంధనల ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివాహ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని డిక్లరేషన్‌ని అందించాలని నిబంధన ఉంది.

Immortal Jelley Fish: నిజంగా ఈ జీవికి మరణం లేదు.. జీవితం మీద విరక్తి కలిగే వరకూ బతికే అవకాశం ఉన్న ఏకైక జీవి ఇదే!

Viral Photos: ఆ దేశంలో గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపిస్తే జైలుకే.. ఎందుకో తెలుసా..?

Ind Vs Pak: కెప్టెన్‎గా హుందాతనాన్ని ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. రిజ్వాన్‌ను కౌగిలించుకుని అభినందనలు..