Pralhad Joshi: ఉచిత రేషన్ పథకం నిరంతరం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి

|

Jul 11, 2024 | 5:39 PM

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నిరంతరం కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 (NFSA) ద్వారా ప్రతి ఇంటికి 5 కిలో ధాన్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు.

Pralhad Joshi: ఉచిత రేషన్ పథకం నిరంతరం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి
Union Minister Pralhad Joshi
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నిరంతరం కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 (NFSA) ద్వారా ప్రతి ఇంటికి 5 కిలో ధాన్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద రేషన్ కార్డ్ హోల్డర్‌కు 5 కిలోల ఉచిత రేషన్ కేటాయింపును వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందన్నారు.

ఏప్రిల్ 2020లో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం కారణంగా, కేంద్ర ప్రభుత్వం PMGKAYని ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్‌కు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు అందించింది. రేషన్ కార్డ్ హోల్డర్లకు 5 కిలోల ఆహార ధాన్యాలను అందించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఏప్రిల్ 2020 నుండి రేషన్ కార్డ్ హోల్డర్‌లు ఒక్కొక్కరికి 10 కిలోల రేషన్‌ అందిస్తూ వస్తోంది. NFSA కింద సబ్సిడీ ధరపై 5 కిలోలు, PMGKAY కింద 5 కిలోలు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇక ఆ తర్వాత 2022 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నగా మార్చింది. ఈ పథకం కింద ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్‌కు 5 కిలోల రేషన్ ఉచితంగా అందిస్తోంది. కాగా, మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగలిగారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…