Maharashtra: ఏక్ నాథ్ షిండే వర్గానికి ఈసీ ఝలక్.. ఉద్ధవ్ వర్గానికి కాగడా గుర్తు కేటాయింపు..

|

Oct 11, 2022 | 6:56 AM

మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనలో పార్టీ గుర్తు కోసం రెండు వర్గాల మధ్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి ‘శివసేన..

Maharashtra: ఏక్ నాథ్ షిండే వర్గానికి ఈసీ ఝలక్.. ఉద్ధవ్ వర్గానికి కాగడా గుర్తు కేటాయింపు..
Uddhav Thackeray
Follow us on

మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనలో పార్టీ గుర్తు కోసం రెండు వర్గాల మధ్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి ‘శివసేన ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే’ పార్టీ పేరు ను కేటాయించింది. అంతే కాకుండా కాగడా గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి ‘బాలాసాహెబ్‌చి శివసేన’ పేరును ఖరారు చేసింది. అయితే పార్టీ గుర్తును ఇంకా కేటాయించలేదు. అందు కోసం మాత్రం మరో మూడు ఆప్షన్స్ ఇచ్చింది. వాటిలోంచి ఏదో ఒక దానిని ఎంచుకోవాలని సూచించింది. అంధేరీ తూర్పు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెలలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. శివసేన ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లంబును తమకే కేటాయించాలంటూ ఠాక్రే వర్గం, సీఎం ఏక్‌నాథ్‌ శిండే వర్గాలు డిమాండ్ చేశాయి. అయితే అదే సమయంలో అంధేరీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. శివసేన పేరును, ఎన్నికల గుర్తును ఎక్కడా వాడొద్దని ఇరు వర్గాలకు ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ లకు తాత్కాలికంగా గుర్తులు ఇస్తామని, ఆప్షన్స్ ఇస్తే అందులోంచి సెలెక్ట్ చేసి కన్ఫార్మ్ చేస్తామని వెల్లడించింది.

ఈసీ నిర్ణయంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను సూచించింది. కాగా అందులో నుంచి కాగడా గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది. శిండే వర్గానికి పార్టీ పేరును ఖరారు చేసినప్పటికీ గుర్తు కోసం మరిన్ని ఆప్షన్స్ పంపించాలని సూచించింది. శివసేన తమది అంటే తమది అంటూ ఉద్ధవ్ వర్గం, షిండే వర్గాలు పోట్లాడుకుంటున్న తరుణంలో.. విల్లు-బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఉద్దవ్‌ వర్గం నిర్ణయంపై షిండే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్‌ ఠాక్రే సిద్ధాంతానికి తామే అసలైన వారసులమని, బాలా సాహెబ్‌ పేరు తమ వర్గానికి దక్కకుండా ఉద్దవ్‌ వర్గం కుట్ర చేసిందని ఆరోపించారు. ఏ గుర్తు కావాలో సోమవారం లోగా చెప్పాలని అటు ఉద్ధవ్‌ వర్గం, ఇటు షిండే వర్గానికి ఈసీ నోటీసులు ఇచ్చింది. న్యాయపోరాటం తమదే అసలైన శివసేనగా తేలుతుందని ఇరువర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి