దేశమంతా విస్తరిస్తోంది టీవీ 9 నెట్‌వర్క్. మీడియా అంటే వార్తలు ప్రసారం చేయడం మాత్రమే కాదూ.. జనం అవరసరాలను చేసుకుని వారి పక్షాన నిలుస్తుంది. ఆపద ఉందని తెలిస్తే ఆదుకుంటామని చాటి చెబుతోంది. ఎప్పటికప్పడు సమాజంలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల అవగాహన కల్పిస్తుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త కార్యక్రమానినికి శ్రీకారం చుట్టింది టీవీ 9 నెట్‌వర్క్.
టీవీ9 నెట్‌వర్క్ రోడ్డు భద్రత, సాంకేతికత ఆవిష్కరణలకు సంబంధించి సామాన్య ప్రజలలో ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఈ రంగాల్లో అవార్డుల రెండో సీజన్ నవంబర్ 2 గురువారం ఢిల్లీలో ఘనరంగా ప్రారంభమైంది. రోడ్డు భద్రత, సాంకేతికత, స్థిరత్వంతో కూడిన స్మార్ట్ మొబిలిటీ ఎకో సిస్టమ్‌ను అవగాహన కల్పించడం లక్ష్యంగా సాగింది. ‘లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవాణా, లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. రోడ్డ రవాణాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలపై వక్తలతో సవివరంగా చర్చించారు.
‘లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్’ మొదటి దశ ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా స్మార్ట్ మొబిలిటీ ఎకోసిస్టమ్ గురించి అవగాహన కల్పించారు. ఇందులో రోడ్డు భద్రత, సాంకేతికత, ఆవిష్కరణ, స్థిరత్వం వంటి అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రవాణా, లాజిస్టిక్స్ రంగ నిపుణులు ఢిల్లీలో చర్చలు జరిపారు.
టీవీ 9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్ కమీషనర్ ఆశిష్ కుంద్రా పాల్గొన్నారు. అతనితో పాటు, బెస్ట్ రోడ్‌వేస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ గుప్తా, కారవాన్ రోడ్‌వేస్ లిమిటెడ్ యజమాని రాజీవ్ ఎన్ గుప్తా, ఎక్స్‌ప్రెస్ రోడ్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సంకిత్ గుప్తా, కాంటినెంటల్ సీనియర్ ప్రతినిధి రజనీష్ కొచ్‌గావే కూడా పాల్గొన్నారు. ఈ నిపుణులందరూ రోడ్డు భద్రత, సాంకేతికత వంటి ముఖ్యమైన సమస్యలపై తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. రోడ్డు భద్రత, టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక విషయాలను ప్రజలకు వివరించారు.
కాంటి 3600 గురించి అవగాహన
టెక్ డ్రైవర్ కాంటి 3600 సేవలు, పరిష్కారాల గురించి అవగాహన పెంచడం ఈ ఈవెంట్ ముఖ్య లక్ష్యం. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ సేవలను అందిస్తుంది. ఇది సెన్సార్‌లతో పని చేస్తుంది. సరియైన సమయంలో రోడ్డుపై ఉన్న వాహన టైర్లను రిమోట్‌గా పర్యవేక్షించడంలో కూడా సహాయపడుతుంది. కాంటి కనెక్ట్ టెక్నాలజీ టైర్ పనితీరు, టైర్ ఒత్తిడి, ఉష్ణోగ్రత, వాహనంతో పాటు ప్రయాణీకులను రోడ్డుపై సురక్షితంగా కాపాడుతుంది. సరియైన సమయంలో టైర్ల పర్యవేక్షణను మెరుగుపరుస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ వాహన ఆపరేటర్లకు, ప్రజలకు రహదారి భద్రతను పెంచుతుందని వక్తలు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…