Manorama Khedkar: పోలీసుల అదుపులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ..! కారణమిదే..

మనోరమను పుణే కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు పూజా ఖేద్కర్‌ తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రెండుసార్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం, ఫేక్‌ సర్టిఫికేట్ల వ్యవహారంపై వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేద్కర్‌పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఐఏఎస్‌ ట్రయినింగ్‌ను నిలిపివేసి అకాడమీకి వెనక్కి పిలిపించారు.

Updated on: Jul 18, 2024 | 6:33 PM

భూవివాదంలో రైతులను గన్‌తో బెదిరించిన కేసులో వివాదాస్పద ట్రైయినీ ఐఏఎస్‌ అధికారి పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమను పుణే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయ్‌ఘడ్‌ హోటల్‌లో నక్కిన మనరోమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనోరమపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదయ్యింది. మనోరమను పుణే కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు పూజా ఖేద్కర్‌ తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రెండుసార్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం, ఫేక్‌ సర్టిఫికేట్ల వ్యవహారంపై వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేద్కర్‌పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఐఏఎస్‌ ట్రయినింగ్‌ను నిలిపివేసి అకాడమీకి వెనక్కి పిలిపించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us