India: వారెవ్వా.! అమెరికా, చైనాలను అధిగమించిన భారత్.. ఏ విషయంలోనో తెల్సా

ప్రపంచంలో శరవేగంగా బలపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటన్న విషయం తెలిసిందే. గత పదేళ్ల కాలంలో ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు 5వ స్థానంలో నిలిచిందన్న విషయం కూడా కొత్త కాదు.

India: వారెవ్వా.! అమెరికా, చైనాలను అధిగమించిన భారత్.. ఏ విషయంలోనో తెల్సా
India, China, America
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2024 | 11:30 AM

ప్రపంచంలో శరవేగంగా బలపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటన్న విషయం తెలిసిందే. గత పదేళ్ల కాలంలో ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు 5వ స్థానంలో నిలిచిందన్న విషయం కూడా కొత్త కాదు. అయితే అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలతో పోల్చితే భారత్ ఇంకా వెనుకబడి ఉండగా, వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఈ మధ్య యురోపియన్ యూనియన్ స్థూల జాతీయోత్పత్తి (GDP)ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోని 25 పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితా తయారు చేసింది. ఈ జాబితాలో కొన్ని అంశాల్లో అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలను భారత్ అధిగమించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) 2024 సంవత్సరానికి గాను రూపొందించిన ఎకనమిక్ అవుట్‌లుక్‌లో అత్యధిక GDP వృద్ధి రేటు నమోదు చేస్తున్న దేశాలను వరుస క్రమంలో పేర్కొంది. ఇందులో భారతదేశాన్ని శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా IMF తన నివేదికలో పేర్కొంది. IMF అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు 7%గా ఉంటుందని, 2025లో అది 6.5%గా నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇది ప్రపంచంలో ఏ దేశంలో పోల్చుకున్నా అత్యధికం. ఈ రకంగా భారతదేశం అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలను అధిగమించి జీడీపీ వృద్ధి రేటులో మొదటి స్థానంలో నిలిచింది.

భారత్ తర్వాతి స్థానంలో చైనా!

శరవేగంగా విస్తరిస్తూ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో చైనా 2వ స్థానంలో నిలిచింది. IMF అంచనాల ప్రకారం 2024 సంవత్సరంలో చైనా 5% వృద్ధి రేటు నమోదు చేస్తుందని, 2025 నాటికి అది 4.5%గా ఉంటుందని పేర్కొంది. చైనా ప్రపంచంలోనే 2వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న విషయం తెలిసిందే. వృద్ధి రేటు విషయంలో భారత్‌తో పోల్చితే కాస్త వెనుకబడినప్పటికీ.. భారత్ కంటే ఎన్నో రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

జీడీపీ వృద్ధి రేటు విషయంలో చైనాతో సరిసమానంగా పోటీపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండోనేషియా నిలిచింది. ఈ దేశంలో 2024 సంవత్సరంలో 5% (చైనాతో సమానంగా) వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF అంచనా వేసింది. 2025 నాటికి ఈ వృద్ధి రేటు మరికాస్త పెరిగి 5.1%గా ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా ప్రస్తుతం ప్రపంచంలో 16వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

చైనా, ఇండోనేషియా దేశాల తర్వాత 3.6% వృద్ధి రేటుతో టర్కీ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నిలిచింది. గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా కూడా జాబితాలో టర్కీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2024లో 3.2% వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పోలాండ్ (3.1%), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా – USA (2.6%), సౌత్ కొరియా (2.5%), స్పెయిన్ (2.4%), మెక్సికో (2.2%) దేశాలు నిలిచాయి.

యూరప్‌లో ధనిక దేశాలు ఇవే

యూరప్ అంటేనే అభివృద్ధి చెందిన దేశాల సమాహారం. ఆ ఖండంలో అనేక దేశాలు ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. స్థూల జాతీయోత్పత్తి (GDP)ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఐరోపా ఖండంలో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. వరుసక్రమంలో జర్మనీ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, స్పెయిన్ వంటి దేశాలు నిలిచాయి. అదే తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించిన జాబితాలో తొలి స్థానంలో నార్వే (95,510 డాలర్లు) నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్ దేశాలు నిలిచాయి. అంటే ఈ దేశాల్లో ఒక్కో పౌరుడి సగటు ఆదాయం ఏడాదికి కనీసం 54,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 45.74 లక్షలు) నుంచి గరిష్టంగా రూ. 80 లక్షల వరకు ఉంది. భారత తలసరి ఆదాయం 2021లో 2,150 డాలర్లు (రూ. 1,80,462)గా లెక్కించారు. అంటే యూరప్‌లో 10వ స్థానంలో నిలిచిన దేశంతో పోల్చుకున్నా సరే.. భారత్ అనేక రెట్లు వెనుకబడి ఉందని అర్థమవుతుంది.

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?