నాన్‌వెజ్‌కి సమానమైన శనగ గుగ్గిళ్లతో బోలెడు లాభాలు..!
Jyothi Gadda
27 August 2024
శనగలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆహారంగా చెబుతారు. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటే, మరికొందరు కూరలుగా తింటారు.
మాంసం తినలేనివారికి శనగలు అద్భుతమైన ఆహారం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.
రోగనిరోధకశక్తి పెంచే దివ్యౌషదంగా శనగలను పిలుస్తారు. శనగ గుగ్గిళ్లు మొక్కల ప్రోటీన్‌కు మంచి మూలం. ఇది శరీర కణజాలాల నిర్మాణానికి మరమ్మత్తుకు అవసరం.
శనగ గుగ్గిళ్లు పుష్కలమైన ఫైబర్‌తో నిండి ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
శనగ గుగ్గిళ్లలో విటమిన్ B, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఫైబర్ , పొటాషియం కంటెంట్ కారణంగా శనగ గుగ్గిళ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శనగ గుగ్గిళ్లు తృప్తికరంగా ఉంటాయి. ఫైబర్‌తో నిండి ఉంటాయి. దీంతో ఆకలిని మందగిస్తుంది. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
ఫైబర్ రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది, ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శనగ గుగ్గిళ్లు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.