జ్యోతిరాధిత్య సింధియా ప్యాలస్ లో దొంగలు పడ్డారు, ఏమేం పోయాయో మరి ? మొదలైన పోలీసుల దర్యాప్తు
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలస్ లో దొంగలు పడ్డారు. ఎంతో భద్రత, దుర్భేద్యమైన కోటలా ఉండే ఈ ప్యాలస్ లో దొంగలు పడ్డారంటే ఆశ్చర్యం కలగక మానదు. మధ్యప్రదేశ్ లోని...
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలస్ లో దొంగలు పడ్డారు. ఎంతో భద్రత, దుర్భేద్యమైన కోటలా ఉండే ఈ ప్యాలస్ లో దొంగలు పడ్డారంటే ఆశ్చర్యం కలగక మానదు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో గల జై విలాస్ ప్యాలస్ లో గత సోమ లేదా మంగళవారం రాత్రి దొంగలు పడి దోచుకెళ్లారు. సింధియా ఈ ప్యాలస్ రాయల్ కూడా. దీన్ని రాణీ మహల్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ మహల్ లోని ఓ గదిపై గల వెంటిలేటర్ ద్వారా చోరులు లోపలికి ప్రవేశించారని, వస్తువులన్నీ చెల్లాచెదరు చేశారని పోలీసులు తెలిపారు. ఎంతమంది దొంగలు లోపలికి చొరబడ్డారో, ఏమేం వస్తువులు పోయాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు తమ డాగ్ స్క్వాడ్ తో సహా వచ్చి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ప్యాలస్ లో కొంత భాగాన్ని బ్యాంకుగా కూడా వినియోగిస్తున్నారు. 1874 లో అప్పటి గ్వాలియర్ మహారాజా జయాజీ రావు సింధియా ఈ ప్యాలస్ ను నిర్మించారు. 19 వ శతాబ్దానికి చెందిన ఈ రాణీ మహల్.. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా అధీనంలో ఉంది. ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ తదితరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు అక్కడ ఉన్నాయా, లేదా అన్నది తెలియాల్సి ఉంది.
దొంగలు ఈ ప్యాలస్ లో విలువైన బంగారు నగలు, ఆభరణాలు ఉంటాయని భావించి ఈ చోరీకి దిగారని తెలుస్తోంది. అసలు ఈ మహల్ కి ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారన్న విషయం కూడా తెలియడంలేదు. బహుశా ఈ భవనం గురించి బాగా తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సింధియాకు ఈ చోరీ సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.
రన్నింగ్ కారుపై పుషప్స్..వినూత్న విన్యాసం..చుస్తే వావ్ అనాల్సిందే..!స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు : push ups on moving car video.
అగ్నిపర్వతాన్ని ఆపుతున్న విగ్నేశ్వరుడు వీడియో..ఏడాదిలో ప్రతిరోజు వినాయక చవితి : Vighveshwar stops the volcano video.