AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TN New CM : సీఎంగా విజయ్‌.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఎమ్మెల్యేలు వీరే!

ఐపోయింది.. గత నాలుగైదు రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతన్న హైడ్రామాకు ఫుల్‌స్టాప్‌ పడింది. సినిమాను మించిన ట్విస్ట్‌లు ఎదుర్కొన్న కథనాయకుడు ఎట్టకేలకు ఎట్టకేలకు సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఇవాళ ఉదయం 10 గంటలకు విజయ్ అను నేను అని ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Anand T
| Edited By: |

Updated on: May 10, 2026 | 9:54 AM

Share

అరవగోలకు ఎండ్ కార్డు పడింది. ఎట్టకేలకు గవర్నర్ నుంచి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్ వచ్చేసింది. ఇంకేముందు ప్రతి నియోజకర్గంలోని టీవీకే పార్టీ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్. ఇవాళ తమ అభిమాన నటుడు, నాయకుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో తమిళనాట అంతా టీవీకే జెండాలు రెపరెపలాడుతున్నాయి. 1967 తర్వాత ఏర్పాటవుతున్న ద్రవిడేతర పార్టీ కావడంతో దేశవ్యాప్తంగా అందరిచూపు తమిళనాడు వైపే ఉంది.

చాలా సస్పెన్స్ తర్వాత టీవీకేకు బేషరతుగా VCK మద్దతిచ్చింది. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన 118 మంది సభ్యుల సంఖ్యాబలం టీవీకేకు వచ్చేసింది. TVK 107, కాంగ్రెస్‌కు 5, CPI 2, CPM 2, VCK 2, IUML 2 రెండు సీట్లు. మొత్తం ఐదు పార్టీల మద్దుతో ఇప్పుడు టీవీకే బలం 120కి చేరిపోయిందని విజయ్ గవర్నర్‌కు తెలపడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం విజయ్‌ను సీఎంగా నియమిస్తున్నాన ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా గవర్నర్ అనుమతిచ్చారు. అలాగే ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని సూచించారు.

ప్రభుత్వ ఏర్పాటు గ్రీన్‌ సిగ్నల్ రావడంతో చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే… డీఎంకే కూటమిలో ఉంటూ ఇప్పటిదాకా పదువులు తీసుకోని కాంగ్రెస్‌ ఈసారి తమిళ కేబినెట్‌లోకి ఎంటరవుతోంది. టీవీకేకి మద్దతిచ్చినప్పుడే కుదిరిన డీల్‌తో కాంగ్రెస్‌కి రెండు మంత్రి పదవులు ఫిక్స్ అయ్యాయ్. దీంతో ఉదయం 10 గంటలకు విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తుండగా.. అందులో ఒకరు కాంగ్రెస్‌ నుంచి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

మొత్తంగా.. దేశాన్నే ఆశ్చర్యపరిచారు విజయ్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టు ఒంటరిగానే పోటీ చేసి ద్రవిడ పార్టీలకు దమ్ము చూపించారు. అత్యధిక సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మరో పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించారు. విజయ్ తొలి అడుగు, 1967 నుండి తమిళనాడులో కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ నిర్మాణాన్ని సమర్థవంతంగా బద్దలుకొట్టింది. 50 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా టీవీకే నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..