ఉగ్ర స్థావరం గుట్టురట్టు.. ఎక్కడంటే..?

ఉగ్రవాదుల స్థవరాలు పాక్, పీవోకేలోనే కాదు.. మనదేశంలో కూడా బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో ఓ ఉగ్రస్థావరం బయటపడింది. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అడవుల్లో భద్రతా బలగాల సాయంతో బుధవారం పోలీసులు పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన స్థావరాన్ని గుర్తించారు. అఖల్ అడవుల్లో ఈ స్థావరం ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఈ స్థావరంలో అధునాతన ఆయుధాలతోపాటు.. పేలుడు పరికరాలను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలను, ఉగ్రవాద […]

ఉగ్ర స్థావరం గుట్టురట్టు.. ఎక్కడంటే..?
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2020 | 9:31 PM

ఉగ్రవాదుల స్థవరాలు పాక్, పీవోకేలోనే కాదు.. మనదేశంలో కూడా బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో ఓ ఉగ్రస్థావరం బయటపడింది. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అడవుల్లో భద్రతా బలగాల సాయంతో బుధవారం పోలీసులు పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన స్థావరాన్ని గుర్తించారు. అఖల్ అడవుల్లో ఈ స్థావరం ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఈ స్థావరంలో అధునాతన ఆయుధాలతోపాటు.. పేలుడు పరికరాలను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలను, ఉగ్రవాద సాహిత్యాన్ని, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దేవసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.