వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సమాజంలో ఇలాంటివి నిత్యం జరుగుతున్నప్పటికీ మనుషుల్లో ఏమాత్రం మార్పు రావాడం లేదు.. కేసులు అవుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.. వివాహేతర సంబంధం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా.. భార్య వినేలేదు.. దీంతో భర్త భార్యను హత్యచేశాడు.. చివరకు పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆమెతో అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తెలియడంతో అధికారులు అతన్ని సస్సెండ్ చేశారు.. అంతేకాకుండా.. అంతకుముందు కానిస్టేబుల్ కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి.. అతడిని కూడా సస్పెండ్ చేశారు.. ఈ ఘటన తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా, ఉలుందర్‌పేట పక్కనే ఉన్న పిల్లూరులో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లకురిచ్చి జిల్లా, ఉలుందర్‌పేట పక్కనే ఉన్న పిల్లూరులో దంపతులు అశోక్ (35), రమణి, 32 నివసిస్తున్నారు.. ఈ క్రమంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవజరిగింది.. గత నెల 19న ఆమెను భర్త అశోక్ హత్య చేసి పారిపోయాడు.. దీంతో ఉతక్కల్ పోలీసులు అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. భార్య రమణి.. తిరునావలూరులో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ నందగోపాల్‌తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలిపాడు.. మానుకోవాలని చెప్పినందుకు చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు.. ఇదే విషయంపై భార్యను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరగిందని.. దీంతో హత్య చేసినట్లు అశోక్ తెలిపాడు. అంతకుముందు కూడా రమణికి పలువురితో సంబంధాలున్నట్లు తెలిపాడు..
దీంతో ఎస్సై నందగోపాల్ పై ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. రమణితో వివాహేతర సంబంధం నిజమని తెలియడంతో విళుపురం రేంజ్ డీఐజీ దిశా మిట్టల్ నందగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా విళుపురం జిల్లా మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కళ్లకురిచ్చిలో పని చేసే సమయంలో రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని విచారణలో తెలియడంతో అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..