మా దగ్గర హిందీ వాళ్లు పానీపూరి అమ్ముతున్నారు.. దుమారం రేపుతోన్న మంత్రి వ్యాఖ్యలు..

|

May 13, 2022 | 4:31 PM

Minister: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందీ భాష విదాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. హిందీ జాతీయ భాష అంటూ కొందరు, కాదంటూ మరికొందరు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సినీ తారల నుంచి రాజకీయ నాయకుల వరకు...

మా దగ్గర హిందీ వాళ్లు పానీపూరి అమ్ముతున్నారు.. దుమారం రేపుతోన్న మంత్రి వ్యాఖ్యలు..
Representative Image
Follow us on

Minister: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందీ భాష విదాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. హిందీ జాతీయ భాష అంటూ కొందరు, కాదంటూ మరికొందరు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సినీ తారల నుంచి రాజకీయ నాయకుల వరకు హిందీ భాష వ్యవహారంపై చేస్తున్న కామెంట్స్‌ టాక్‌ ఆఫ్‌ టౌన్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మంత్రి తమ ప్రాంతంలో హిందీ మాట్లాడే వారు పానీపూరి అమ్ముకుంటున్నారు అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇటీవల కొయంబత్తూర్‌లోని భారతియార్‌ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హిందీ కంటే ఇంగ్లిష్‌ భాష చాలా విలువైంది. హిందీ మాట్లాడే వారు తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగాల్లో నటిస్తున్నారు. కేవలం హిందీ మాట్లాడే వారు కొయంబత్తూరులో పానీపూరి అమ్ముకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇక తమిళ విద్యార్థులు ఏ భాషనైనా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, హిందీ ఆప్షన్‌గా ఉండాలని, తప్పనిసరి కాదని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 గురించి మంత్రి మాట్లాడుతూ.. ఈ విద్యా విధానంలోని ప్రయోజకరమైన అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాషల విధానాన్ని మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు. దేశంలో విద్యావ్యవస్థలో తమిళనాడు ముందజంలో ఉందన్న మంత్రి.. తమిళ విద్యార్థులు ఏ భాషనైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, హిందీ కేవలం ఆప్షన్‌ లాంగ్వేజ్‌గా మాత్రమే ఉండాలని, తప్పనిసరి భాష కాదని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన తమిళనాడు గవర్నర్‌ ఆర్ఎన్‌ రవి మాట్లాడుతూ.. ఇప్పటికే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌ను బోధిస్తున్నప్పుడు హిందీని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించడం కొసమెరుపు.