Tamil Nadu: ఉదయనిధి తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? సీఎం ఎంకే స్టాలిన్ ఫ్లాన్ అదేనా?

తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కరుణానిధి కుటుంబం మాత్రమే. గతంలో కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగానే చిన్న కుమారుడు ఎంకె స్టాలిన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

Tamil Nadu: ఉదయనిధి తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? సీఎం ఎంకే స్టాలిన్ ఫ్లాన్ అదేనా?
Mk Stalin, Udhayanidhi Stalin
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 19, 2024 | 12:42 PM

తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కరుణానిధి కుటుంబం మాత్రమే. గతంలో కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగానే చిన్న కుమారుడు ఎంకె స్టాలిన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత స్టాలిన్ సీఎం అయ్యాక ఆయన కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే తరహాలో పార్టీలో కీలకంగా మారారు. ఒకప్పుడు స్టాలిన్ ఏ ఫార్ములాతో రాజకీయాల్లో సక్సెస్ అయ్యారో.. ఇపుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు. అయితే ఇదంతా సీఎం స్టాలిన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఫార్ములా.. ఏంటా వ్యూహం..?

తమిళనాడులో దివంగత నేత ఎం కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనంతరం వారసుడు ఎవరు అన్నదీ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చర్చ అనడం కన్నా అదో పెద్ద వివాదం అని చెప్పొచ్చు..! అప్పటికే డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్, తన వారసుడు అంటూ కరుణానిధి స్వయంగా ప్రకటించారు. పెద్ద కుమారుడైన అలగిరి కరుణానిధి వారసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే వారసుడిగా తన అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా 2009 లోక్‌సభ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా స్టాలిన్‌ను ఎంపిక చేశారు.

ఆ సమయంలో కరుణానిధి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించకపోవడం అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడన్న వ్యూహంతో ఆ రోజు కరుణానిధి ఆ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధి మరణానంతరం స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు సీఎం అయ్యేందుకు ఆ రోజు కరుణానిధి నిర్ణయం ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం స్టాలిన్ కూడా అదే ఆలోచనతో తన కుమారుడు ఉదయినిధి స్టాలిన్‌కు వారసత్వం అందాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఉదయనిధికి మంత్రివర్గంలో చోటు కల్పించిన స్టాలిన్, ఏకంగా డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న స్టాలిన్ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలంటే మంత్రిగా కంటే ఉపముఖ్యమంత్రిగా ఉండడం మంచిదన్న ఆలోచనతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా డీఎంకేకు ప్రతిష్టాత్మకం రానున్నాయి. తమిళనాడులో డీఎంకే ఏఐడీఎంకే ప్రధాన పార్టీలుగా ఉండగా వచ్చే ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బరిలో ఉండబోతోంది. దాంతో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే స్టాలిన్ తోపాటు తన అనుకున్న ముఖ్యమైన వారు పార్టీ బాధ్యతలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వీలైనంత త్వరగా డిప్యూటీ సీఎం చేయడం, ఇటు పార్టీకి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సులువుగా ఉంటుందని స్టాలిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు గతంలో తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీలో స్టాలిన్ మంచి పట్టు సాధించగలిగారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయినిధి స్టాలిన్‌కు కూడా అదే ఫార్ములా ఉపయోగపడుతుందని గట్టిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటన రానప్పటికీ డీఎంకేలో కీలక నేతల ద్వారా అందిన సమాచారం మేరకు వీలైనంత త్వరగా స్టాలిన్ తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

తమిళనాడు సీఎం స్టాలిన్ అసలు వ్యూహం అదేనా..!
తమిళనాడు సీఎం స్టాలిన్ అసలు వ్యూహం అదేనా..!
అజీర్తి నుంచి తక్షణఉపశమనం కావాలా? ఈ పండు ముక్కలు కాసిన్నితింటేసరి
అజీర్తి నుంచి తక్షణఉపశమనం కావాలా? ఈ పండు ముక్కలు కాసిన్నితింటేసరి
ట్రంప్‌పై హత్యాయత్నం.. సీన్‌ రీక్రియేట్‌ చేసిన పిల్లలు! వీడియో
ట్రంప్‌పై హత్యాయత్నం.. సీన్‌ రీక్రియేట్‌ చేసిన పిల్లలు! వీడియో
పకృతి అంటే ఇష్టమా ముంబైకి సమీపంలో అందమైన ప్రదేశాల్లో పర్యటించండి
పకృతి అంటే ఇష్టమా ముంబైకి సమీపంలో అందమైన ప్రదేశాల్లో పర్యటించండి
పేకమేడలు మూవీ రివ్యూ.. సినిమా హిట్టా..? ఫట్టా.?
పేకమేడలు మూవీ రివ్యూ.. సినిమా హిట్టా..? ఫట్టా.?
వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. ఈ పొరపాటు చేస్తే రెట్టింపు టోల్
వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం.. ఈ పొరపాటు చేస్తే రెట్టింపు టోల్
భారీ వర్షాలతో... SBI బ్యాంకులోకి వరద నీరు
భారీ వర్షాలతో... SBI బ్యాంకులోకి వరద నీరు
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
బైడెన్ వద్దు బాబోయ్.. కమలా హారిస్ వైపే మెజారిటీ డెమొక్రాట్‌లు..!
బైడెన్ వద్దు బాబోయ్.. కమలా హారిస్ వైపే మెజారిటీ డెమొక్రాట్‌లు..!
ఈ సీజన్‌లో వేడి వేడిగా చికెన్ సూప్‌ని ట్రై చేయండి రెసిపీ మీ కోసం
ఈ సీజన్‌లో వేడి వేడిగా చికెన్ సూప్‌ని ట్రై చేయండి రెసిపీ మీ కోసం
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు